ఉమ్మడి ఖమ్మం జిల్లా SGF అండర్ 11 ,14 ,17 స్కెటింగ్ ఎంపికలు
ఉమ్మడి ఖమ్మం జిల్లా SGF అండర్ 11& 14 & 17 బాలబాలికల స్కేటింగ్ ఎంపికలు నవంబర్ 1,2వ తారీఖున స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం ఖమ్మం లో నిర్వహించబడుతున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా SGF అండర్ 11& 14 & 17 బాలబాలికల స్కేటింగ్ ఎంపికలు నవంబర్ 1,2వ తారీఖున స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం ఖమ్మం లో నిర్వహించబడుతున్నాయి. ఈ ఎంపికలకు ఆసక్తి గల క్రీడాకారులు. అక్టోబర్ 29వ తారీఖు సాయంత్రం 7గంటల లోపు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మీ యొక్క ఎంట్రీలు ఇవ్వగలరు అని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి E.సోమశేఖర్ శర్మ ,భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి M. వెంకటేశ్వర చారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల యొక్క అర్హతలు అండర్ 11 క్రీడాకారులు వయసు ఈ విద్యా సంవత్సరం 3 తరగతి నుండి 5వ తరగతి, అండర్ 14 & 17 వారు 6వ తరగతి నుండి ఇంటర్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అర్హులు. అండర్ 14 క్రీడాకారులు 01/01/2011 తరువాత జన్మించి 6 నుండి చదువుతున్న వారు అర్హులు.అండర్ 11 బాలబాలికల 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు 01.01.2014 తరువాత జన్మించిన వారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ద్వారా స్టడీ సర్టిఫికెట్. ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావలెను. ఇంటర్మీడియట్ ప్రథమ , ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి ఇంటర్నెట్ మెమో డౌన్లోడ్ చేసుకుని ప్రిన్సిపాల్ చేసి సంతకం చేయించుకుని. కళాశాల బోనిఫైడు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని హాజరు అవ్వవలెను. ఇట్టి ధ్రువీకరణ పత్రములు తీసుకొని రాని వారిని ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించబడరు.ఉమ్మడి ఖమ్మం జిల్లా నందు ఉన్నటువంటి వ్యాయామ విద్య ఉపాధ్యాయులు,వ్యాయామ దర్శకులు. అందరు కూడాను ఈ నియమ నిబంధను పాటిస్తూ 1వ తారీఖు ఉదయం తొమ్మిది గంటల వరకు స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం లో తమ సొంత కిట్టుతో రిపోర్ట్ చేయవలసినదిగా ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు కె.నరసింహామూర్తి , వాసిరెడ్డి నరేష్ కుమార్ లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.మరిన్ని వివరాలకు 9912399211,80199 52592,7989731339 నెంబర్లను సంప్రదించగలరు
0 Comments
please do not enter any spam link in the comment box