ఉమ్మడి ఖమ్మం జిల్లా పాఠశాలల అండర్ 14,17 బాలబాలికల హాకీ మరియు కరాటే ఎంపికలు
ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 14,17 బాలబాలికల హాకీ మరియు కరాటే ఎంపికలు అక్టోబర్ 29 వ తేదీన (మంగళవారం) ఉదయం 09 గంటలకు స్థానిక రామచంద్ర కాలేజ్ క్రీడా ప్రాంగణం లో హాకీ,మరియు కరాటే గాజులరాజమ్ బస్తీ హనుమాన్ టెంపుల్ దగ్గర గల ఎంపవర్ మెంట్ సెంటర్ లో కరాటే ఎంపికలు నిర్వహించనున్నారని ఉమ్మడి జిల్లాల విద్యాశాఖాధికారులు.E. సోమశేఖరశర్మ గారు మరియుM.వెంకటేశ్వరాచారి గారు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఎంపికలలో పాల్గొనే క్రీడాకారులు 6వ తరగతి నుండి. పదవ తరగతి వరకు చదువుతూ 1/1/2008 తరువాత జన్మించిన వారు 17 ఇయర్స్ కి అర్హులు. మరియు 01/01/2011 తరువాతా జన్మించిన వారు 14 ఇయర్స్ కి అర్హులు ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్,ఫోటోతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ మరియు స్టడి సర్టిఫికెట్ తో హాజరు కావలెను.. పైన పేర్కొన్న ధ్రువీకరణ పత్రములు తీసుకొనిరాని వారిని ఎట్టి పరిస్థితులలోను
ఎంపికలకు అనుమతించబడరని ఉమ్మడి ఖమ్మం జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శకులు వాసిరెడ్డి నరేష్ కుమార్ ,K. నర్సింహ మూర్తి లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు,వ్యాయామ దర్శకులు అందరు కూడా ఈ నియమ నిబంధనలు పాటిస్తూ క్రీడాకారులు సకాలంలో హాజరు అయ్యేలా చూడాలని కోరారు.
0 Comments
please do not enter any spam link in the comment box