Model schools || ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్ ) ప్రవేశపరీక్ష హాల్ టికెట్స్ విడుదల
Model schools || తెలంగాణ రాష్ట్రంలోని194 ఆదర్శ పాఠశాలలో 2024-25 విద్యాసంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు సంబందించి ఈనెల 7వ తేదీన జరిగే ప్రవేశపరీక్ష హాల్ టికెట్స్ విడుదల అయ్యాయి. 6వ తరగతి లో మొత్తం సీట్లతోపాటు ఏడు నుంచి పదో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈనెల 7వ తేదీన రాతపరీక్ష జరగనుంది.
ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతి, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏడు నుంచి పదో తరగతికి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు.తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 62,983 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు.విద్యార్థులు తమ అధికారిక వెబ్ సైట్ లో నేటి నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు ఎస్ శ్రీనివాసాచారి ఒక ప్రకటన విడుదల చేశారు.
హల్ డౌన్లోడ్ లింక్
6th Class Hall tickets download link :
https://telanganams.cgg.gov.in/SPTSMSSIXTHAPPL/hallTickettsms6th20012024sp07042024.appl
7th Class to 10th Class Hall tickets download link :
https://telanganams.cgg.gov.in/SPTSMSVIITOXAPPL/hallTickettsmsVIItoXyghj56098ff2024.appl
Web Site : telanganams.cgg.gov.in
0 Comments
please do not enter any spam link in the comment box