AP TET/DSC టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షల వాయిదా
AP TET/DSC
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఫలితాలు, డీఎస్సీ(ఉపాధ్యాయ నియామక పరీక్ష) పరీక్షలను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఫలితాలు, డీఎస్సీ(ఉపాధ్యాయ నియామక పరీక్ష) పరీక్షలను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఇంతకుముందు ప్రకటించిన విధంగా డీఎస్సీ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు, టెట్ ఫలితాలను ఈనెల 14న విడుదల చేయాల్సి ఉంది. ఇంతవరకు డీఎస్సీ హాల్‌టికెట్లను విడుదల చేయకపోగా, 14న విడుదల చేయాల్సిన టెట్ ఫలితాలు కూడా వెల్లడికాలేదు. దీంతో అభ్యర్ధులు అయోమయంలో పడ్డారు.ఈలోపు శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా టెట్ ఫలితాలతోపాటు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు పూర్తి అయినా తరువాతనే కొత్త తేదీలను ప్రకటిస్తారు.
0 Comments
please do not enter any spam link in the comment box