echallan|| తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు.... జనవరి 31 వరకు
పెండింగ్ చలానాల చెల్లింపు - భారీ తగ్గింపు
వాహనం ఎదైనా భారీ తగ్గింపు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో వాహనాల పై ఉన్నటువంటి పెండింగ్ చాలనా గడువు నేటితో ముగియనున్న డిస్కౌంట్ గడువు రేవంత్ రెడ్డి సర్కార్ వాహనదారులకు ట్రాఫిక్ చాలన్ల రాయితీ గడువును మరొక సారి పెంచుతూ వాహనదారులకు మరొకసారి అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్రం లో మొత్తం పెండింగ్ చలాన్లు మూడు కోట్ల 9 లక్షల దాకా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కేవలం కోటి ఏడు లక్షల మంది మాత్రమే చలానా చెల్లించారు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 107 కోట్ల ఆదాయం వచ్చింది. వాహనదారుల కోరికపై ఈ యొక్క గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది. పెండింగ్ చాలాన్లు మరొకసారి వాహనదారులు రాయితీ అవకాశం ఉపయోగించుకొని చెల్లించాల్సింది గా తెలంగాణ సర్కార్ ప్రకటించింది.. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల పెండింగ్ చలాన్లపై 90%, బైక్ చలాన్లపై 80%, ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60%, లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్ చలాన్లపై 50%డిస్కౌంట్ నేటి తో పొందండి.
మీ ఫోన్ నుండే చలానా చెల్లించండి..
డైరెక్ paytm App లో మీరే స్వయంగా కట్టేయొచ్చు search baar లో challan అని టైప్ చేయగానే వచ్చేస్తుంది
https://echallan.tspolice.gov.in/publicview/
0 Comments
please do not enter any spam link in the comment box