TS TET-2022 SPECIAL || 5వ తరగతి తెలుగు || 2.యాదగిరిగుట్ట
TS TET-2022 SPECIAL || 5వ తరగతి తెలుగు || 2.యాదగిరిగుట్ట
25 ముఖ్యమైన ప్రశ్నలు
1)యాదగిరిగుట్ట పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి?
A: దర్శనీయ స్థలాలు,సంస్క్రతి
2) యాదగిరిగుట్ట పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: వ్యాసం
3)యాదగిరిగుట్ట పాఠం ఉద్ధేశం ఏమిటి?.
A: తెలుగునేలలో పేరుపొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట గురించి పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం
4) తెలంగాణలో గొప్ప కీర్తికెక్కిన పుణ్యక్షేత్రం ఏది?
A: యాదగిరిగుట్ట
5)యాదగిరిగుట్ట లో కొలువై ఉన్న దేవుడు ఎవరు?
A: నరసింహస్వామి
6)యాదగిరిగుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు ?
A: యాదాద్రి(పూర్వం నల్లగొండ)
7) యాదగిరిగుట్ట హైదరాబాదు కు ఎంత దూరం లో కలదు ?
A: 60km
8) యాదర్షి ఎవరి కుమారుడు?
A: ఋష్యశృంగుని కొడుకు
9)ఎవరి పేరున యాదగిరిగుట్ట కు ఆ పేరు వచ్చింది?
A: యాదర్షి
10) దేదీప్యమానం అనగా అర్థం ఏమిటి?
A: బాగా వెలిగేటి కాంతి
11)కల్పతరువు అనగా అర్థం ఏమిటి?
A: కోరికలు తీర్చే చెట్టు,దేవలోక వృక్షం
12) యాదగిరిగుట్ట దగ్గర దేనిని పుణ్యకార్యక్రమంగా భావిస్తారు ?
A: గోశాలకు ఆవులను దానం చేయడం
13)యాదగిరిగుట్ట పైన గల గుండం పేరేమిటి?
A: విష్ణు గుండం
14)ఈ కొండపై గల మరొక దేవాలయం ఏది?
A: రామలింగేశ్వరాలయం
15)నరసింహ ఆలయంలో స్వామివారికి అష్టోత్తరశత కలశాభిషేకం ఎప్పుడు జరుగుతుంది?
A: ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున
16) శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి?
A: 11 రోజులు
17) తొవ్వ అనగా అర్థం ఏమిటి ?
A: దారి,మార్గం
18) సప్తగిరి చానెల్ ను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు?
A: యాదగిరి.
19) కొండగుట్ట మన రాష్ట్రంలో ఏ జిల్లాలో కలదు?.
A: కరీంనగర్
20) కొండగుట్టలో వెలిసిన దేవుడు ఎవరు?
A: ఆంజనేయస్వామి
21) హనుమాన్ దీక్ష చేపట్టిన వారు ఎన్ని రోజులపాటు నిష్ఠగా ఉంటారు?
A: 41రోజులు
22) అజయ్ అనే విద్యార్థి యాదగిరిగుట్ట పాఠం విని వారి ఊరిలో జరిగే ఉత్సవం గురించి పోస్టర్ తయారు చేసాడు .అయిన అతను సాధించిన సామర్థ్యం ఏమిటి?
A: సృజనాత్మకథ.
23) జరిగిపోయిన పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను ఏమంటారు?.
A: భూతకాలపు వాక్యాలు
24)జరుగుతున్న పనిని తెలిపే వాక్యాలను ఏమంటారు ?
A: వర్తమానకాలపు వాక్యాలు
25)జరగబోయే పనులు గురించి తెలిపే వాక్యాలను ఏమంటారు ?
A: భవిష్యత్ కాలపు వాక్యాలు
Pre by : G SURESH
0 Comments
please do not enter any spam link in the comment box