TS TET SPECIAL || 5వ తరగతి తెలుగు || 7.చిట్యాల ఐలమ్మ
TS TET SPECIAL || 5వ తరగతి తెలుగు
1) చిట్యాల ఐలమ్మ పాఠం ఇతివృత్తం ఏమిటి ?
A: స్ఫూర్తి ,తెలంగాణ చరిత్ర
2) చిట్యాల ఐలమ్మ పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి ?
A: గేయం
3) చిట్యాల ఐలమ్మ పాఠం ఉద్ధేశం ఏమిటి ?
A: అన్యాయాన్ని ఎదురించి పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గురించి విద్యార్థులకు తెలియజేయడం*
4) చాకలి ఐలమ్మ ఎక్కడ పుట్టింది?
A: వరంగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలో
5) ఐలమ్మకు ఎన్ని సంవత్సరాల వయసు లో పెళ్ళి అయింది?
A: 13సం.
6) సిరులు అనగా అర్థం ఏమిటి ?
A: సంపదలు.
7) తోక దొక్కిన తాచు అనేది ఒక.....
A: జాతీయం
8) నాతి అనగా అర్థం ఏమిటి ?
A: స్త్రీ
9) ధర అనగా అర్థం ఏమిటి ?
A: భూమి
విషయావగాహణ
10) "యెవుసము" అనగా అర్థం ఏమిటి ?
A: వ్యవసాయం
1 1) పట్వారి ఐలమ్మను ఎందుకు చిత్రంగా చూశాడు?
A: కూలి మాని గొప్పింటి ఆవిడలా వ్యవసాయం చేస్తుందని
12) "కాలికింది చెప్పోలే ఉండాలని" ఎవరు అన్నారు?
A: పట్వారి
13) కయ్యానికి సిద్ధమవడం అంటే ఏమిటి ?
A: కొట్లాటకు సిద్ధమవడం
14) ఐలమ్మ కయ్యానికి ఎందుకు సిద్ధమైంది?
A .పట్వారి తనను కౌలు మానేసి కూలికి రమ్మనందుకు
15) కడుపు మండింది....అనేది ఒక_____
A: జాతీయం
మరికొన్ని జాతీయాలు
16) తలప్రాణం తోకకు వచ్చినట్లు
17) పొయ్యిలో ఉప్పు వేసినట్లు
18) తోక తొక్కిన తాచు.
19) అరికాలి మంట నెత్తికెక్కు
20) తంతె పరుపులో పడ్డట్లు
21) పోయింది పొల్లు ఉన్నది గడ్డి.
క్రింది వాక్యాలలో కర్త ,కర్మ, క్రియ లను గుర్తించండి
1) విద్యార్థులు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు.
కర్త: విద్యార్థులు.
కర్మ: ఊరేగింపు
క్రియ: నిర్వహిస్తున్నారు
2) తాతయ్య స్నేహను సర్కస్ కు తీసుకొని పోయాడు.
A: కర్త: తాతయ్య
కర్మ: స్నేహ
క్రియ: తీసుకుని పోయాడు
3)పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించాడు.
A: కర్త: పింగళి వెంకయ్య
కర్మ:త్రివర్ణ పతాకం
క్రియ: రూపొందించాడు.
4) రజిత గేయం రాసింది.
A: కర్త: రజిత
కర్మ: గేయం
క్రియ: రాసింది
5) అమ్మ పాపాయికి పాలు ఇచ్చింది
A: కర్త: అమ్మ
కర్మ: పాపాయి
క్రియ: ఇచ్చింది.
6) మంగ శుభలేఖను చదివింది.
A : కర్త = మంగ
కర్మ= శుభలేఖ
క్రియ: చదివింది.
7) సందీప్ నాయనమ్మను కథలు చెప్పమని అడిగాడు.
A: కర్త: సందీప్
కర్మ: నాయనమ్మ
క్రియ: అడిగాడి
G. SURESH
0 Comments
please do not enter any spam link in the comment box