TS TET-2022 SPECIAL || 4వ తరగతి తెలుగు || 6.సుమతీ శతకం
TSTET-2022 SPECIAL || 4వ తరగతి తెలుగు
1) సుమతీ శతకం రచించింది ఎవరు?
A: బద్దెన
2) శతకం అనగా నేమి?
A: నూరు(100) పద్యాలు గలది
3) సుమతీ శతకం పాఠం ఇతివృత్తం ఏమిటి?
A: నైతిక విలువలు
4) సుమతీ శతకం పాఠం యొక్క సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: పద్యాలు
5) సుమతీ శతకం పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి?
A: సుమతీ శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలు పెంపొందించడమే ఈ పాఠం ఉద్ధేశం
6)శతక పద్యాలు ముఖ్యంగా దేనికి ఉపయోగపడతాయి?
A: నైతిక విలువలు పెంపొందించడానికి
7) విపరీతు పదానికి అర్థం ఏమిటి?
A: గొప్ప,ఎక్కువ
8) నెపము పదం అర్థం ఏమిటి?
A: తప్పు,వంక
9) ఉపకారము అర్థం ఏమిటి?
A: మంచి,మేలు
10) అపకారము అర్థం ఏమిటి?
A: చెడు,కీడు
11) చీమలు పెట్టిన పుట్టలు ఎవరు కొలువుంటారు?
A: పాము
12) ఇరువు అనగా అర్థం ఏమిటి ?
A: కొలువు,స్థానం
13) పామరుడు అంటే ఎవరు?
A: తెలివి తక్కువ వాడు
14) హేమము అనగా అర్థం ఏమిటి?
A: బంగారము
15) భూమీశులు అనగా ఎవరు?
`A: భూమికి అధిపతులు,రాజులు
16) భువి అనగా అర్థం ఏమిటి?
A: భూమి,నేల
17) మనిషికి తన శత్రువు ఎవరు?
A: తన కోపం
18) తథ్యము అనగా అర్థం ఏమిటి?.
A: నిజము
19) మనిషికి రక్షణగా నిలిచే గుణం ఏది?.
A: శాంతం.
20) మనషి గుణాలలో తనకు బంధువు ఎవరు?.
A: తన దయ
21) బంధువులు ఎప్పుడు వస్తారని కవి భావం?
A: సంపద కలిగినపుడు
22) కవి బంధువులను వేటితో పొల్చాడు?
A: కప్పలతో.
23) కప్పలు చెరువు దగ్గరకు ఎప్పుడు చేరుతాయి?
A: చెరువు నీటితో నిండినపుడు
24) వేగపడు అనగా అర్థం ఏమిటి?
A: తొందరపడు
25) ఎవరు నీతిపరుడని కవి భావం?
A: చెప్పింది విని ఏది నిజం ఏది అబద్ధం అని నిర్ధారించుకునేవాడు
26) మహి అనగా అర్థం ఏమిటి?
A: భూమి
27 ) కల్ల అనగా అర్థం ఏమిటి?
A: అబద్ధము
28) బలవంతమైన పాము ఎవరి చేతిలో చస్తుందని కవి భావం?
A: చలిచీమల చేతిలో
29) బలవంతులను కవి ఎవరితో పోల్చారు?
A: పాములతో
30) పలువురు అనగా అర్థం ఏమిటి?.
A: అనేకలు,చాలామంది
31) కూరిమి అనగా అర్థం ఏమిటి?
A: ప్రేమ,స్నేహం,సోపతి
32) విరసము అనగా అర్థం ఏమిటి?
A: కొట్లాట,కలహము
33)నిక్కము అనగా అర్థం ఏమిటి?
A: నిజము
34) శారీరక బలం కలవానికంటే ఎవరు బలవంతుడు?
A: నీతిపరుడు(నీతి తెలిసినవాడు)
35) గ్రావము అంటే అర్థం ఏమిటి?
A: కొండంత పెద్దరాయి
36) గజము అంటే ఏమిటి?
A: ఏనుగు (కొలతల లో 5అడుగులు ఒక గజం)
37) మావటివాడు అనగా అర్థం ఏమిటి?
A: ఏనుగును నడిపించే వాడు
క్రింది పదాలకు అర్థాలు రాయండి
38) భూమీశులు చక్కగా పరిపాలించారు
=రాజులు
39) మనం కల్లలు మాట్లాడకూడదు
= అబద్దాలు
40) మంచి స్నేహితులవల్ల మంచి జరుగుట తథ్యము
=నిజము
41) హేమం తో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు
= బంగారం.
విశేషణ పదాలు గుర్తించండి
42) కపిల్ దేవ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు.
=వేగంగా
43) రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది
:= చాలా పెద్ధగా*
44) మంజీరా నదిలోని నీళ్ళు తియ్యగా ఉంటవి
= తియ్యగా
45)భువనగిరి కోట చాలా విశాలంగా ఉన్నది
=విశాలంగా
46) రామాపురం బడిలో అందమైన తోట ఉన్నది
= అందమైన
47) పిల్లలు తోటకు వెళ్లి ___ గులాబి పూలు కోశారు
= ఎర్రని
48) సూది దారంతెచ్చి __మాల కట్టారు
= పొడవైన
49) బొమ్మల పెళ్ళిని .___ చేశారు
=ఘనంగా
50) రామయ్యకు ___పులతోట ఉన్నది
=పెద్ద
G.SURESH
0 Comments
please do not enter any spam link in the comment box