LATEST POSTS

10/recent/ticker-posts

TS TET SPECIAL - 2022 || 4వ తరగతి తెలుగు || 1.తెలంగాణ వైభవం

 TS TET SPECIAL -2022 || 4వ తరగతి తెలుగు || 1.తెలంగాణ వైభవం

TS TET SPECIAL - 2022 || 4వ తరగతి తెలుగు || 1.తెలంగాణ వైభవం

TS TET SPECIAL - 2022 || 4వ తరగతి తెలుగు || 1.తెలంగాణ వైభవం

1) 4వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఎన్ని సంసిద్ధత పాఠాలు కలవు?

A: 6పాఠాలు.

2) తెలంగాణ వైభవం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి?

A: తెలంగాణ గొప్పతనం

3) తెలంగాణ వైభవం పాఠం యొక్క సాహిత్య ప్రక్రియ ఏది?

A: గేయం

4) తెలంగాణ వైభవం పాఠం ఉద్దేశం ఏమిటి?

A: తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు,కవులకు,కళాకారులకు,త్యాగధనులకు,ఘనచరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని చెప్పడమే ఈ పాఠం ఉద్ధేశం

5) 'సోన'  అనగా  అర్థం ఏమిటి?

A: సన్న వాన

6) కోన అనగా  అర్ధం ఏమిటి?

A: అడవి

7) పాఠంలో ఏయే నదుల గరించి ప్రస్థానించబడింది?

A: గోదావరి,కృష్ణ

8)నల్ల బంగారం అని కవి దేనిని పోల్చాడు?

A; బొగ్గు

9) కైత  అనగా అర్థం ఏమిటి?

A: కవిత

10) భాగవతం ను తెలుగులో రచించింది ఎవరు?

A: పోతన

11) పోతన ఏ ప్రాంతంలో జన్మించాడు?

A: బమ్మెర

12) పోతన ఏ వంశానికి చెందినవాడు?

A: బమ్మెర

13) బమ్మెర ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు?

A: జనగామ

14) పోతన ఇతర రచనలు ఏవి?

A: భోగినీ దండకం, వీరభద్ర విజయం

15)  రాణి రుద్రమ దేవి ఏ రాజ వంశానికి చెందిన వీర వనిత?

A: కాకతీయ

16) కవనము అనగా  అర్థం ఏమిటి?

A: కవిత్వం, పాండిత్యం

17): పాల్కురుకి సోమనాధులు గారు ఎక్కడ జన్మించారు?

A: వరంగల్ సమీపంలోని పాల్కురుకి గ్రామంలో

18)పాల్కురుకి సోమనాధులుగారి రచనలు ఏవి?

A: బసవపురాణం, వృశాధిప శతకం

19) భక్తరామదాసుకి గల మరొక బిరుదు ఏమిటి?

A: కంచర్ల గోపన్న

20) భద్రాచల శ్రీ రామ మందిరాన్ని కట్టించింది ఎవరు?

A: భక్త రామదాసు

21) భక్తరామదాసు ఏ ప్రాంతంలో జన్మించారు?

A: ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి

22) భక్తరామదాసు రచించిన శతకం పేరేమిటి?

A: దాశరథి శతకం

23) "దాశరథీ కరుణాపయోనిధీ"  అనే మకుటం ఎవరి రచనల్లో కనిపిస్తుంది?

A: భక్తరామదాసు

24) కోడెదూడలను మొక్కుగా చెల్లించే ఆనవాయితీ ఎక్కడ కలదు?

A: వేములవాడ

25)  వేములవాడ ప్రస్తుతం ఏ జిల్లా లో కలదు?

A: రాజన్న సిరిసిల్లా జిల్లా

26) పీరిదట్టీల లో మెరుపు లాంటివాడు ఎవరు?

A: జాన్ పహాడ్ సైదులు

27)తెలంగాణలో ఉన్న అతి పెద్ద క్రైస్తవ మందిరం ఏది?

A: మెదక్ చర్చి

28) వేల్పు  అనగా అర్థం ఏమిటి?

A: దేవుడు

29) రామప్ప దేవాలయంను నిర్మించింది ఎవరు?

A: రేచర్ల రద్రుడు

30) రామప్ప దేవాలయానికి గల మరొక పేరేమిటి?

A: రామలింగేశ్వరాలయం

31 )రామప్ప దేవాలయం ప్రస్తుతం ఏ జిల్లా లో కలదు?

A: ములుగు

32)రామప్ప దేవాలయం ఏ ప్రాంతంలో కలదు?

A: పాలంపేట

33) సౌరు  అనగా  అర్థం ఏమిటి?

A: అందం

34) దీము అనగా అర్థం ఏమిటి?

A: ధైర్యం

35): ఆదివాసీలకు ధైర్యం ఎవరు?

A: కొమరం భీమ్

36) చార్మీనార్ ఎక్కడ కలదు?

A: హైదరాబాద్

37) చార్మీనార్ ను కట్టించింది ఎవరు?

A: మహమద్ కులీ కుతుబ్ షా

38) పేరిణి నృత్యం ఏ ప్రాంతం లో ప్రసిద్ధి?

A: తెలంగాణలో

39) ఏ హిందూ దేవుని గౌరవార్థం పేరిణి నృత్యాన్ని నిర్వహిస్తారు?

A: శివుడు

40) ఇటీవల పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించిన వారెవరు?

A: పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ

41) తెలంగాణ లో ప్రసిద్ధి చెందిన జానపద కథా రూపం ఏది?

A: ఒగ్గు కథ

42) ఒగ్గు అనగా  అర్థం ఏమిటి?

A: శివుని చేతిలోని ఢమరుకం

43) ఒగ్గు కథ చెప్పే కళాకారులను ఏమంటారు?

A: ఒగ్గు గొల్లలు

44)యక్షగానం తెలంగాణతో పాటు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన  ప్రాచీన శాస్త్రియ కళ?

A: కర్ణాటక

45) నిజాంను ఎదురించిన తెలంగాణ వీరుడు ఎవరు?

A: నారాయణరావు పవార్

46)  భారత ప్రధానిగా చేసిన తెలంగాణ ముద్దు బిడ్డ ఎవరు?

A: పి.వి.నరసింహారావు

47) సింగరేణి దేనికి ప్రసిద్ధి?

A: బొగ్గుగనులకు

48) తెలంగాణ కాళ్ళు కడిగిన నది ఏది?

A: కృష్ణా

49) తెలంగాణకు తల స్నానమైన నది ఏది?

A: గోదావరి

50)దేశీ పదాలకు పేరొందిన కవి ఎవరు?

A: పాల్కురికి సోమనాథుడు

G.SURESH

Post a Comment

0 Comments