LATEST POSTS

10/recent/ticker-posts

YOGA / DSC PET MCQ WITH SOLUTION-2

 YOGA / DSC PET MCQ WITH SOLUTION-2

YOGA / DSC PET MCQ WITH SOLUTION-2


11.జీర్ణ అగ్నిని పెంచుటలో తోడ్పడు శద్ధీ క్రియ.

1. ధౌతి 2. నౌలీ 3. నేతి 4. బస్తీ

A: 2

Solution: 

నౌళి (Abdominal Massage):

ఈ ప్రక్రియ ద్వార ఉదర కండరాలు వ్యాయామానికి  గురియగను.

ఉదర కండరాలను కుడి మరియు ఎడమ వైపుకు తిప్పుతూ ఉండవలెను.

దీని వలన జఠర రసం ఉత్పతి పెరుగును,మధుమేహం,గ్యాస్ట్రో సమస్యలు తొలగును.


12.ఈ క్రింది యోగ పద్ధతి లో ఏది ఋతుస్రావం సమయంలో చేయుటకు వీలు కాని పద్ధతి?

i. ఆసనాలు ii. ప్రాణాయామం iii.షట్కర్మ    iv. సూర్య నమస్కారాలు

1. i,ii మరియు iv 2. i మరియు iiv 3. i మరియు iii 4. ii మరియు iv

A: 2

Solution:

యోగా ఆసనములు ప్రారంభించుటకు ముందు షట్కర్మలు ఆచరించవలెను,దిని వలన శరీరం బాహ్యముగా మరియు అంతరంగా శుద్ధి కలుగును,దీనిని తత్వ శుద్ధి అందురు..

యోగా ఆసనములు ముందుగా శవాసనం ప్రారంభించవలెను. దిని వలన మానసిక,శారీరక ప్రశాంతత కలుగును.

ప్రతీ అసనము చివర శవాసనంతో ముగించవలెను.

యోగా ఆసనములు శిక్షకుని సమక్షములో వేయవలెను.

స్త్రీలు ఋతుస్రావం సమయములో యోగా ఆసనములు మరియు సూర్య నమస్కారాలు అభ్యసించరాదు, దిని వలన ప్రత్యుత్పత్తి అవయవాల పైన అధిక ఒత్తిడి కలిగి నొప్పి అధికం అగును.


13. ఈ క్రింది  యోగా ఆసన సమయంలో వెన్నుపూస వెనక్కి తిప్పడం జరుగదు?

1 భుజంగాసనం 2. చక్రాసనం 3. పచ్చిమొత్తాసన 4. ధనురాసన

A: 3

Solution:

సంస్కృతంలో పశ్చిమ అనగా వీపు లేదా వెనుక భాగము ఉత్తన అనగా అర్ధం ‘stretch’ or ‘extended’((సాగిన' లేదా 'విస్తరించిన’).

ఈ ఆసనం వలన శరీరములోని వెనుక భాగంలో గల అన్ని కండరాలు తీవ్ర ఒత్తిడికి గురి అగును, ఫలితముగా శరీరం వంగే గుణం అధికముగా పొందును. 

పచ్చిమోత్తాసనము వలన Hamstring muscles అధికముగా వ్యాయమమునకు గురియగును. 

ఈ ఆసనము ఉదరము, ప్రేగులు, కాలేయం, మూత్రపిండాలు మరియు క్లోమం వంటి ఉదయం అవయవాలను సరియగు వ్యాయమము కలిగించును


14.Shatkarmas సాధన దీనికొరకు సూచించారు.

1. Asana ముందు మాత్రమే 2. Asana మరియు Pranayama ముందు

3. ప్రాణాయామం ముందు మాత్రమే 4. Asana మరియు Pranayama తర్వాత

A: 2

Solution:

ఆసన మరియు ప్రాణాయామం చేయుటకు ముందుగా శరీరములోని బాహ్య మరియు అంతర్గత అవయవాలలో పేరుకుపోయిన మలినాలను తొలగించవలెను.

మలినాలను తొలగించుటకు యోగ పద్దతిలో ఉండే విధానమే శుద్ధి క్రియలు.

వీటి వలన శరీరం మరియు మనసులో ఉండు మలినాలు తొలగించబడును.


15. మలబద్ధకం తో బాధపడుతున్న రోగులకు ఉపయోగకరంగా ఉండే షట్కర్మ.

1. బస్తీ మరియు నేతి 2. నౌలీ మరియు నేతి

3. బస్తీ మరియు నౌలీ 4. నౌలీ మరియు కపాలభాతి

A: 3

Solution: 

ఈ శుద్ధి క్రియ చేయడము వలన పెద్ద ప్రేగులో (colon)లో ఉండు వ్యర్దపదార్దాలు తొలగించబడును.

ఈ విధానంలో సన్నని గొట్టం మలద్వారము నందు ప్రవేశపెట్టాలి.ఈ గొట్టము ద్వార నీటిని మలద్వారము ద్వార ప్రేగులోనికి ప్రవేశపెట్ట వలెను.

ఇలా చేయడం వలన పెద్ద ప్రేగు లోని కండరాలు సంకోచము చెందును మరియు మలము గిలకొట్టబడును.

ఈ విధానము ద్వార మలబద్ధకం మరియు ఎసిడిటి తొలగిపోవును.


16. వ్యక్తి బాహ్య ప్రపంచం లోని వివిధ విషయాలపై ఆకర్షితుడు కాకుండా సమాజం పై మంచి అభిప్రాయం కలిగి ఉండునట్లు చేయు యోగా సాధనం.

1. ఆసన 2. ధారణ 3.ప్రత్యాహార   4.యమము 

A: 3

Solution:

ప్రత్యాహారము(Discipline of senses):


ప్రాపంచిక విషయముల వైపు మళ్లే ఇంద్రియాలను బలవంతంగా దారిలోనికి తెచ్చుట. 

మనస్సును నియంత్రించడం వలన వ్యక్తి జ్ఞానమును పొందును ఇది జ్ఞాన నియంత్రణలో తోడ్పడును.

ఈ జ్ఞానం వ్యక్తి ఆత్మను పరమాత్మకు సందానం చేయడములో తోడ్పడును.


17. వ్యక్తిగత పరిశుభ్రతను తెలుపు యోగా నియమం.

1. సంతోష 2.తపస్య 3. శౌచ 4. ఈశ్వర ప్రణిధాన

A: 3

Solution:

నియామ – వ్యక్తిగత క్రమశిక్షణ(Individual Discipline or observances)

వ్యక్తి తనకు తానుగా పరిశుభ్రం అలవాట్లను ఏర్పరచుకొనుటలో తోడ్పడును, ఇది వ్యక్తి ఆచారాలను పెంపొందుటలో తోడ్పడును.

దీనిలో మరల 5 రకములు కలవు.

శౌచం (Cleanliness):  వ్యక్తి తన బాహ్య మరియు అంతర్గత శరీర భాగములను శుభ్ర పరుచుకోనుట.


18. జ్ఞాన నియంత్రణలో తోడ్పడు యోగా నియమం.

1. ఆసన 2. ప్రాణాయామం  3. ధారణ   4. ప్రత్యాహార

A: 4

Solution:

మనస్సు యొక్క ధ్యానం లేదా అంతర్గతీకరణ కోసం సిద్ధం చేయడానికి బాహ్య ప్రపంచం నుండి ఇంద్రియాలను ఉపసంహరించుకునే పద్ధతులు ప్రతిహార లో ఉంటాయి. 

అంతర్గత ప్రయాణం ప్రారంభమయ్యే ప్రదేశం.

మనస్సును నియంత్రించడం వలన వ్యక్తి జ్ఞానమును పొందును ఇది జ్ఞాన నియంత్రణలో తోడ్పడును.


19. ప్రాణవాయువు నియంత్రణ చేయుటకు ఉపయోగపడే యోగ సాధనం.

1.ఆసనా 2. నియమ  3. ప్రాణాయామం   4. ప్రత్యాహార

A: 3

Solution:

పతాంజలి అష్టాంగ యోగా నియమావళిలో 4వ అంగం ప్రాణాయామం. 

ప్రాణాయామముఅను సంస్కృత పాదములో Prana అనగా అర్ధం Vital Force or life, Ayama అనగా అర్ధం control . 

ప్రాణాయామం అనగా  ప్రాణశక్తిని లేదా జీవశక్తిని నిలిపి ఉంచుట లేదా ప్రాణవాయువుని నియంత్రించుట. 

దీనిలో ఒక క్రమ పద్దతిలో ఊపిరి పీల్చుకోవడం మరియు ఊపిరిని నిలిపిఉంచ్చుట ద్వార ప్రాణవాయువు శరీరములోని అన్ని భాగాలకు ప్రవేశపెట్టడం జరుగును. 

శరీరములో ప్రాణవాయువు నాడుల ద్వార ప్రసరించును.

ప్రాణాయామం వలన నాడులు శుద్ధి చేయడం జరుగును తద్వారా మనస్సుకు ప్రశాంతత కలుగును.


20. ఒక లక్ష్యం పైన మనస్సును కేంద్రికరించుటనే ఈ విధముగా  పిలుచుదురు.

1. ధారణ 2.ధ్యాన 3.సమాధి 4.నియమ

A: 1

Solution:

ధారణ: ఒక విషయం పైన మనస్సును కేంద్రికరించుట,మనస్సును ఒక చోట బంధించుట.

ధరణం ఒక అంతర్గత వస్తువుపై మనస్సు యొక్క ఏకాగ్రతతో వ్యవహరిస్తుంది. 

ఇది అన్ని అంతర్గత అంశాలు  మేల్కొల్పు ప్రారంభ స్థితి.

Post a Comment

0 Comments