LATEST POSTS

10/recent/ticker-posts

తెలంగాణ ఏక‌లవ్య మోడ‌ల్ స్కూళ్లలో టీచింగ్ పోస్టులు....చివరి తేదీ ఏప్రిల్ 30

EMRS TEACHING STAFF SELECTION EXAM 2021


EMRS TEACHING STAFF SELECTION EXAM 2021

తెలంగాణ రాష్ట్రం‌లోని ఏక‌లవ్య మోడల్‌ స్కూళ్లలో 262 టీచింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ మోడల్ స్కూల్స్ సొసైటీ నోటి‌ఫి‌కే‌షన్‌ విడుదల చేసింది.ఏక‌లవ్య మోడల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 11 ప్రిన్సి‌పాల్‌, 6 వైస్‌ ప్రిన్సి‌పాల్‌, 77 పీజీటీ, 168 టీజీటీ పోస్టు‌లను నింప‌ను‌న్నారు.అర్హత,ఆసక్తి ఉన్న అభ్య‌ర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్‌‌లై‌న్‌లో దర‌ఖాస్తు చేసు‌కో‌వా‌లని రాష్ట్ర ఎక‌లవ్య మోడల్‌ రెసి‌డె‌న్షి‌యల్‌ స్కూల్స్‌ సొసైటీ కార్య‌దర్శి డాక్టర్‌ ఆర్‌‌ఎస్‌ ప్రవీ‌ణ్‌‌కు‌మార్ సూచించారు.

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్టాలలొ ఉన్న ఏక‌లవ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌లో మొత్తం 3479 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

తెలంగాణ లో మొత్తం పోస్టులు సంఖ్య : 262

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పోస్టులు సంఖ్య : 117

14 ప్రిన్సి‌పాల్‌, 06 వైస్‌ ప్రిన్సి‌పాల్‌, 0 పీజీటీ, 97 టీజీటీ 

విద్యా అర్హ‌త‌లు : ప్రిన్సిపాల్ పోస్టులకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. లేదా టీచింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి.

ఫీజు వివరాలు :

ప్రిన్సి‌పాల్‌,  వైస్‌ ప్రిన్సి‌పాల్ : 2000/-

 టీజీటీ, పీజీటీ పోస్టుకు : 1500/-

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులు ప్రారంభం : 01.04.2021

దరఖాస్తుకు సమర్పణ కు చివరి తేదీ: 30.04.2021

దరఖాస్తు ఫారం వివరాలలో మార్పులు వెబ్‌సైట్‌లో : 04.05.2021 నుండి 06.05.2021 వరకు మాత్రమే

పరీక్షల తేదీ :  మే 2021 చివరి వారం / జూన్ 2021 మొదటి వారం

పరీక్ష వ్యవధి : 180 నిమిషాలు (03 గంటలు)

పరీక్ష సమయం : మొదటి షిఫ్ట్ ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు (IST)

రెండవ షిఫ్ట్ : 03:00 p.m. నుండి 06:00 p.m. వరకు. (IST)

అడ్మిట్ కార్డులో సూచించినట్లు పరీక్షా కేంద్రం

FULL NOTIFICATION : CLICK HERE


WEBSITE : CLICK HERE


APPLY ONLINE : CLICK HERE

Post a Comment

0 Comments