LATEST POSTS

10/recent/ticker-posts

Carl Wilhelm Sheeley

నేడు కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే (హార్డ్ లక్ షీలే) జయంతి 



నేడు ప్రాణవాయువును కొనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే (హార్డ్ లక్ షీలే) జయంతి సందర్భంగా.........

జీవిత చరిత్ర :


💨 1742 డిసెంబర్ 9వ తేదీన స్ట్రాల్సండ్, స్వీడిష్ పొమెరానియాలో జన్మించాడు. షీలే తన 14వ ఏటలో ‘గూటెన్‌బర్గ్’ నందు గల ఔషధతయారీ పరిశ్రమలో ఒక అప్రెంటిస్ గా చేరాడు. అక్కడే 8 సంవత్సరాల వరకు ఉన్నాడు. ఆ తర్వాత ఒక వైద్యుని వద్ద సహాయకునిగా ఉన్నాడు. తర్వాత అతడు స్టాక్ హోం నందు ఔషధ నిర్మాతగా ఉన్నాడు. 1770 నుండి 1775 వరకు ‘ఉప్ప్సలా’లో.. తరువాత కోపెన్ లో ఉన్నాడు. షీలే తన జీవితంలో ఎక్కువకాలం జర్మన్ మాట్లాడుటకు ఇష్టపడేవాడు. జర్మన్ భాషను స్వీడిష్ ఔషధ శాస్త్రవేత్తలతో కూడా మాట్లాడేవాడు.

💧 జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. ఐజాక్ అసిమోవ్ అనే శాస్త్రవేత్త అతనిని "హార్డ్ లక్ షీలే" అని పిలిచేవాడు. ఎందువల్లనంటే, ఆయన అనేక రసాయన శాస్త్ర ఆవిష్కరణలను, ఇతర శాస్త్రవేత్తలు ప్రచురించక ముందే తెలియజేశాడు. ఉదాహరణకు ఆక్సిజన్ అనే మూలకం గూర్చి జోసెఫ్ ప్రీస్ట్‌లీ తన పరిశోధనను ప్రచురించక ముందే షీలే తెలియజేయటం. మాలిబ్డనం, టంగస్టన్, బేరియం,హైడ్రోజన్ మరియు క్లోరిన్ వంటి మూలకాలను హంఫ్రీ డేవీ  మరియు యితరులు తెలియజే యక ముందే తెలియజేయటం.

👉 షీలే స్ట్రాల్సండ్ , స్వీడిష్ పొమెరానియా  లో జన్మించాడు. అతని తండ్రి జోచిమ్‌ క్రిస్టియన్ షీలే. అతని తండ్రి ఒక జర్మన్ కుటుంబానికి చెందిన వర్తకుడు. 

షీలే కన్నా ముందు ఉన్న సిద్ధాంతములు:


💧 1770 లలో ఆయన యుక్త వయసులో ఉన్నపుడు వాయువు లపై గల ప్రఖ్యాత సిద్ధాంతమైన "ప్లోజిస్టాన్" సిద్ధాంతం గూర్చి తెలుసుకున్నాడు. ఈ సిద్ధాంతం ప్రకారం మంట వెలువడుటకు గల కారణం ఏదైనా, పదార్థం లో గల ద్రవ్యం మండినపుడు వస్తుంది. ఆ ద్రవ్యం పూర్తిగా లేనపుడు మంట ఆగి దహన ప్రక్రియ ఆగిపోతుంది. షీలే ఆక్సిజన్ కనుగొన్న తరువాత దానిని "ఫైర్ ఎయిర్" గా పిలిచాడు. ఎందువలనంటే ఆ వాయువు దహన ప్రక్రియకు సహాయపడు తుంది. కానీ ఆయన ఆక్సిజన్ గూర్చి ప్లోజిస్టాన్ సిద్ధాంతం లో పదాలను ఉపయోగించి వివరించాడు ఎందుకంటే ఆయన తన ఆవిష్కరణ ప్లోజిస్టాన్ సిద్ధాంతాన్ని ఋజువు చేస్తుందని నమ్మాడు. 

 💧 షీలే ఆక్సిజన్ తయారుచేయుటకు ముందు గా గాలి ని గూర్చి అధ్యయనం చేశాడు. గాలి అనునది పర్యావరణం లో తయారయిన ఒక మూలకం అనీ, అది రసాయన చర్యలు జరుపుతుందని, కానీ అది రసాయన చర్యలలో పాల్గొనదని ఆలోచించసాగాడు. షీలే గాలిలో రెండు రకాల వాయువులుంటా యని అవి మండుటకు దోహదపడే గాలి, మలిన గాలి అని(ఫైర్ ఎయిర్, ఫోల్ ఎయిర్) పరిశోధన చేశాడు.

💧  ఆయన కొన్ని రసాయన పదార్థములైన  పొటాషియం నైట్రేట్ , మాంగనీస్ డై ఆక్సైడ్ , భార లోహ నైట్రేట్లను, సిల్వర్ కార్బొనేట్ మరియు మెర్క్యురిక్ ఆక్సైడ్ లను మండించి కొన్ని ప్రయోగములు నిర్వహించాడు. పై ప్రయోగాలలో ఆయన ఒకే ధర్మములు కల వాయువు ను గుర్తించాడు. అతడు ఉష్ణం వెలువడే రసాయనచర్యలలో ప్లోజిస్టాన్ తో కలిసే ఒక వాయువు ఉన్నదని నమ్మాడు. అది పైర్ ఎయిర్ అని ఊహించాడు.

💧 ఆయన పరిశోధనలను 1775 లో  Chemische Abhandlung von der Luft und dem Feuer గా ప్రచురించుటకు ఇచ్చాడు. కానీ అది 1777 వరకు ప్రచురితం కాలేదు. ఆ సమయంలో జోసెఫ్ ప్రీస్ట్‌లీ మరియు లావోయిజర్ లు ఆక్సిజన్ మరియు ప్లోజిస్టాన్ సిద్ధాంతం గూర్చి వారి ప్రయోగ వివరాలను ప్రచురించారు.

👉 1780 లో మొదటి ఆంగ్ల పత్రికలో  Chemical Observation and Experiments on Air and Fire అనే అంశం ప్రచురితమైనది. అందులో ఉపోద్ఘాతం గా "Chemical Treatise on Air and Fire" అని వ్రాయబడింది.

ప్లోజిస్టాన్ సిద్ధాంన్ని ఋజువు పరచుట..


💧 వైజ్ఞానిక వాదులు ప్లోజిస్టాన్ సిద్ధాంతాన్ని వివరించే కార్ల్ షీలే పాత్రను ప్రశ్నించలేదు.  వాస్తవానికి షీలే ఆక్సిజన్ ను జోసెఫ్ ప్రీస్ట్‌లీ కంటే మూడు సంవత్సరాల ముందుగా కనుగొన్నాడు. కనీసం లావోయిజర్ కన్నా కొన్ని సంవత్సరాల ముందు కనుగొన్నాడు. ప్రిస్టిలీ బహుశా ఆక్సిజన్ ను స్వతహాగా తయారుచేసి యుండడు షీలే యొక్క సిద్ధాంతం పై ఆధారపడి తయారు చేసి ఉంటాడు. లావొయిజర్ మరియు షీలే లను పోల్చినపుడు, షీలే ఆసక్తిదాయకమైన ఆవిష్కరణను కనుగొనుటకు సరియైన ప్రయోగశాలను వినియోగించలేదని తెలుస్తుంది. కానీ లావోయిజర్, ప్రిస్టిలీ, షీలే మరియు యితరుల పరిశోధనలు రసాయన శాస్త్రములో సరైన విధానాలను ప్రామాణీకరించడంలో దోహదపడ్డాయి.

💧  "టోర్‌బెర్న్ ఓలోఫ్ బెర్జ్‌మాన్" యొక్క ఫిర్యాదు ఫలితంగా షీలే అధ్యయనం ఫలితమైన వాయువు ఆక్సిజన్ గా మొదట పరిగణింప బడలేదు. బెర్జ్‌మాన్ అనే వ్యక్తి "సాల్ట్‌ పీటర్" అనే రసాయనం ఆమ్లము తో చర్య జరుపునపుడు ఎరుపు రంగు ఆవిర్లు వచ్చుచున్నవని షీలేకు తెలియజేశాడు. షీలే వెంటనే దానికి వివరణను యిస్తూ మాంగనీస్ డై అక్సైడ్ ధర్మాలను విశ్లేషించాడు.మాంగనీస్ డై ఆక్సైడ్ పై పరిశోధన వల్ల షీలే "ఫైర్ ఎయిర్" యొక్క భావనలను విస్తృతపర చాడు. తుదకు మెర్యురిక్ ఆక్సైడ్, సిల్వర్ కార్బొనేట్, మాంగనీస్ నైట్రేట్మరియు యితర నైట్రేట్ లవణాలను మండించినపుడు ఆక్సిజన్ వెలువడునని నిరూపించాడు. షీలే, ఆయన ప్రయోగముల ఫలితాలను లావొయిజర్ కు లేఖ ద్వారా తెలియజేశాడు.


కొత్త మూలకాలు మరియు సమ్మేళనాలు:


💧 ఆక్సిజన్ ను ఆవిష్కరించ డంతో పాటు షీలే, ఇతర మూలకాలైన బేరియం(1774), మాంగనీస్(1774), మాలిబ్డనం(1778), మరియు టంగస్టన్ (1781) ల ఆవిష్కరణలు షీలేకు ఉమ్మడి గుర్తింపునిచ్చాయి. అదేవిధంగా షీలే మరికొన్ని రసాయన పదార్థాలు అయిన  సిట్రిక్ ఆమ్లము,లాక్టిక్ఆమ్లము,  హైడ్రోజన్ సైనైడ్(ప్రూసిక్ ఆమ్లం యొక్క జలద్రావణం), హైడ్రోజన్ ప్లోరైడ్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ లను కూడా కనుగొన్నా డు. వీటికి తోడు షీలే "పాశ్చురైజేషన్" కు సమానమైన విధానాన్ని కూడా కనుగొన్నాడు. ద్రవ్యరాశిని ఉత్పత్తిచేసే పాస్ఫరస్ ను 1769 లో కనుగొ న్నాడు. ఇది అగ్గిపెట్టెల తయారీ లో ఉపయోగపడే ముఖ్యమైన పదార్థము.

💧 షీలే 1774 లో అతి ముఖ్యమైన 'క్లోరిన్  వాయువు'ఆవిష్కరణ ను చేశాడు. ఆయన స్నేహితుడైన "జొహన్ గొటిబ్ గాన్" ఆయనకు ఒక పదార్థాన్నియిచ్చాడు. అది"పైరోల్యూసైట్" (మలిన  మాంగనీస్ డై ఆక్సైడ్). దీనిలో గల అంశములైన లైమ్‌, సిలికా, ఇనుము లను గుర్తించాడు. కానీ అదనంగా గల అంశీభూతా న్ని గుర్తించలేకపోయాడు (అది మాంగనీస్). ఆయన పైరోల్యూసైట్ ను హైడ్రోక్లోరికామ్లంలో వేడి సాండ్ బాట్ చేసినపుడు పసుపు-ఆకుపచ్చ గల ఘాటైన వాసన గల వాయువు వెలువడినట్లు గుర్తించాడు. ఆ వాయువు ఖాళీ సీసా లో అడుగుకు చేరుకుంటుందనీ, అది గాలికంటె తేలికైనదని గుర్తించాడు. ఆ వాయువు నీటిలో కరుగదని, అది బాటిల్ కార్క్ లను పసుపురంగుగా మార్చుతుందనీ, అది తడిలో రంగులను తొలగిస్తుందనీ (విరంజనకారి), నీలి లిట్మస్ ను ఎరుపుగా మార్చుతున్నదని గుర్తించాడు. ఆయన బ్లీచింగ్ ధర్మములు కలిగిన ఈ వాయువునకు "డిఫ్లోజిస్టికాటెడ్ హైడ్రోక్లోరిక్ ఆసిడ్" అని నామకరణం చేశాడు. ఆ తరువాత హంఫ్రీ డేవీ దానికి క్లోరిన్ గా నామకరణం చేశాడు.

💧 భార లోహాలతో చర్యలు జరిగేటపుడు షీలే ప్రయోగములు చేయునపుడు వెలువడే క్రియా జన్యాలు ప్రమాదకరమైనవి, మరియు అపాయకరమైనవి వెలువడినవి. షీలేకు ఆయన కనుగొన్న పదార్థములు, వాటి నుండి యేర్పడిన పదార్థములను వాసన, రుచి చూసే చెడు గుణం ఉన్నది. మెర్యురీ, లెడ్ , వాటి సంయోగ పదార్థములు మరియు కొన్ని ఇతర పదార్థముల యొక్క ప్రమాదకర వాయువుల ఫలితంగా షీలే కోపెన్ నగరంలో  1786, మే 21 లో మరణించాడు. ఆయన మరణించుటకు రెండు రోజుల ముందు ఒక విధవయైన "ఫోల్" ను వివాహమాడాడు.

Post a Comment

0 Comments