LATEST POSTS

10/recent/ticker-posts

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి 


 యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీలను ప్రకటించింది. 2021  ఫిబ్రవరి 28 నుంచి మార్చి 7 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. అయితే మార్చి 1న పరీక్షలు లేవని వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు మెయిన్‌ రాయడానికి అర్హత సాధిస్తారు. ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్‌ 4న UPSC నిర్వహించింది. పరీక్ష ఫలితాలను అదేనెల 23న ప్రకటించింది. తాజాగా, మెయిన్‌ పరీక్ష తేదీలను వెల్లడించింది. 

 ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ ఎగ్జామ్‌ పేపర్లు :


1.జనరల్‌ ఇంగ్లిష్‌
 2.జనరల్‌ నాలెడ్జ్‌
3.మ్యాథమెటిక్స్‌
4. స్టాటిస్టిక్స్‌
5. ఫిజిక్స్‌
6.జువాలజీ
7.కెమిస్ట్రీ
8.జియాలజీ
9.అగ్రికల్చర్‌
10.యానిమల్‌ హస్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌
11.ఫారెస్ట్రీ
12. అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌
13. సివిల్‌ ఇంజినీరింగ్‌
14.కెమికల్‌ ఇంజినీరింగ్‌ 
15. మెకానికల్‌ ఇంజినీరింగ్‌, 
16.బోటనీ 

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) పరీక్షను సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత నిర్వహిస్తారు. సివిల్స్‌ మెయిన్‌ ఎగ్జామ్‌ జనవరి 8 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్‌ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. పరీక్షకు మూడు, నాలుగు వారాల ముందు హాల్‌టికెట్లు విడుదల చేస్తామని యూపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షకు 10,564 మంది అర్హత సాధించారు.

WEBSITE : CLICK HERE

Post a Comment

0 Comments