తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాలు
1. రాష్ట్ర పక్షి : పాలపిట్ట(శాస్త్రీయనామం - కొరాషియస్ బెంగాలెన్సిస్)
పాలపిట్టకు తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉందని, ప్రతి ఏటా దసరా పండుగ రోజు ఈ పక్షిని దర్శించుకోవడం ఓ పుణ్య కార్యక్రమంగా ప్రజలు భావిస్తారని పేర్కొన్నారు. పాలపిట్టను దర్శించుకోవడం శుభసూచకంగా ప్రజలు భావిస్తారని, లంకపై దండయాత్ర చేసే ముందు శ్రీరాముడు ఈ పక్షిని దర్శించుకున్నారని, అందుకే ఆయన ను విజయం వరించిందని పౌరాణిక గాథలు చెబుతున్నాయని వివరించారు. రాష్ట్రం కూడా విజయపథంలో నడవాలని రాష్ట్ర పక్షిగా పాలపిట్టను తెలంగాణ రాష్ట్ర పక్షిగా ప్రభుత్వం ఖరారు చేసింది. పాలపిట్ట ఒక పక్షి. ఇది తెలంగాణ రాష్ట్రము యొక్క రాష్ట్రపక్షి. దీని శాస్త్రీయ నామము Coracias benghalensis . ఇది "బ్లూ-బర్డ్"గా కూడా పిలువబడుతుంది. ఇది రోలర్ కుటుంబమునకు చెందిన పక్షి. ఇవి ముఖ్యముగా భారత దేశములో, ఇరాక్, థాయిలాండ్ దేశాలలోనూ కనబడతాయి.పాలపిట్ట ఒడిశా, బీహార్‌లకు కూడా రాష్ట్ర పక్షే
శాస్త్రీయ నామం: Coracias benghalensis
ఉన్నత వర్గీకరణ: Coracias
బరువు : 160 Grams
2. రాష్ట్ర జంతువు: జింక (శాస్త్రీయనామం - ఆక్సిస్ ఆక్సిస్)
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ జింకలు ఉన్నాయి. చిన్నచిన్న అడవుల్లోనూ అవి మనుగడ సాగిస్తాయి. అడవి జంతువుల్లో అత్యంత సున్నితమైన, అమాయకమైనదిగా జింకకు పేరుంది. తెలంగాణ ప్రజల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందని జింకను తెలంగాణ రాష్ట్ర జంతువుగా ప్రభుత్వం ఖరారు చేసింది.
3.రాష్ట్ర వృక్షం: జమ్మిచెట్టు (శాస్త్రీయనామం-ప్రోసోఫిస్‌సినరేరియా)
జమ్మి చెట్టు ఆకులను దసరా పండుగ సమయంలో బంగారం అంటారు. సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా బంగారం అని బెల్లంను పిలుస్తారు.
4.రాష్ట్ర పుష్పం: తంగేడు (శాస్త్రీయనామం- కేసియా అరిక్యులేటా)
తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగలో వాడే తంగేడు పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అడవిలో సహజ సిద్ధంగా పెరిగే తంగేడు పూవు ప్రకృతికే అందాన్ని తెస్తుందని, ఈ పూలను సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా కూడా తెలంగాణ అడపడుచులు భావిస్తారని అందుకే తెలంగాణ రాష్ట్రానికి తంగేడు పూవును అధికారిక పుష్పంగా ప్రభుత్వం ఖరారు చేసింది. తంగేడు ఒక విధమైన ఔషధ మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం కేషియా ఆరిక్యులేటా. బంజరు భూముల్లో, ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. మొక్క చాలా అందంగా వుండి, బంగారు రంగులో వుండే పూలు గుత్తులుగా, కొమ్మల చివర పెరుగుతూ, తొలకరి వానల అనంతరం దర్శనమిస్తాయి. వీటిని గొబ్బిపూలు అని కూడా అంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చే మాసంలో, ముగ్గులపై అలంకరించడం, పేడ ముద్దలపై గుచ్చి, గొబ్బెమ్మలుగా పెట్టడం చేస్తూ వుంటారు. ఈ రకమైన ఆచారం వీటికి దైవత్వం ఆపాదించడానికి విధించినదేనని, ఆ మొక్కలోని ఔషధ ప్రాముఖ్యం తెలియజేయడానికే మన పూర్వీకులు ఈ విధమైన ఆచారాలను పాటించారని తెలుస్తుంది.తంగేడు పూలనుబతుకమ్మను పేర్చడంలో ఉపయోగిస్తారు.
5. రాష్ట్రపండు: సీతాఫలం (శాస్త్రీయనామం- అనోనా స్కామోజా)
తెలంగాణ రాష్ట్ర పండు సీతాఫలము /రామాఫలము . శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాల నివారణి. మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం. ఈ కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం. ఈ పండు రామాఫలం, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది.
6. తెలంగాణ రాష్ట్ర చిహ్నం
కాకతీయ కళాతోరణం కింద చార్మినార్, కాకతీయ కళాతోరణంపై సింహతలాటం, చుట్టూ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూభాషల్లో తెలంగాణ ప్రభుత్వం, సత్యమేవజయతే ఉన్నాయి.తెలంగాణ అధికారిక చిహ్నం వృత్తాకారంలో ఉంటుంది, ఈ చిహ్నం బయటి వృత్తం గోధుమ, అంతరవృత్తం చిలకపచ్చ రంగులో ఉంటాయి. వాటి మధ్యలో పైభాగంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఆంగ్లంలో, దాని కింద తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది. మధ్య వృత్తంలో కాకతీయ కళా తోరణం, దాని మధ్యలో చార్మినార్ గుర్తు, దానిపై మూడు సింహాల చిహ్నం ఉంటాయి. బాహ్య వలయం దిగువన "సత్యమేవ జయతే" అని ఉంటుంది. నాలుగున్నరకోట్ల ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ, పచ్చని తెలంగాణ నూటికినూరుపాళ్లు ప్రతిబింబించేలా ఈ లోగోను ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించారు.
రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించిన చిత్రకారుడు - ఏలె లక్ష్మణ్ (నల్లగొండ జిల్లా, ఆత్మకూరు మండలం, కదిరేనిగూడెం వ్యక్తి)
7. రాష్ట్ర అధికారిక మాసపత్రిక - తెలంగాణ
8.రాష్ట్ర అధికారిక చానల్ - యాదగిరి
9.రాష్ట్ర అధికారిక పండుగలు : బతుకమ్మ, బోనాలు
10.బోనంలో ఉండే ఆహారం - పెరుగన్నం
11.లష్కర్ బోనాలు (సికింద్రాబాద్ మహంకాళి బోనాలు), హైదరాబాద్ బోనాలు.
తెలంగాణ ప్రజల ప్రధాన ఆహారం - గటుక (జొన్న సంకటి), ప్రస్తుత ఆహారం (వరి అన్నం).
0 Comments
please do not enter any spam link in the comment box