LATEST POSTS

10/recent/ticker-posts

నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా

భారత రాజ్యాంగం



రాజ్యాంగం:  దేశ పరిపాలనా విధానాలు, చట్టాలు, ప్రజల హక్కులు, బాధ్యతలు మొదలగు అంశాలకు సంబంధించిన రాతపూర్వక గ్రంథమే రాజ్యాంగం

పీఠిక: భారత రాజ్యాంగ స్వరూపం, రాజ్యాంగ లక్షణాలు, రాజ్యాంగ మౌలిక సూత్రాలను తెలిపేదే పీఠిక లేక ప్రవేశిక. పీఠిక గ్రంథం యొక్క పుట్టు పూర్వోత్తరాలను తెలుపుతుంది.

పీఠికలోని అంశాలు

భారత దేశ ప్రజలమైన మేము భారత దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ స్వేచ్ఛా, న్యాయం, సమానత్వం,  సౌభ్రాతృత్వం, వంటి అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించారు. 

వివరణ::

సర్వసత్తాక రాజ్యం:- ఆంతరంగిక, బాహ్య విషయాలలో ఇతరుల జోక్యం లేకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే రాజ్యం

సామ్యవాద రాజ్యం:- వాస్తవ నిర్వచనం ఆర్థిక అసమానతలు లేని సమాజం. అయితే భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వమే ఉత్పత్తులను చేపట్టడం అని అర్థం.

ప్రజాస్వామ్యం:-- ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వమే ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాకులు, ప్రజలే పాలితులు

గణతంత్రం:- అధికారం ప్రజల చేతిలో కాని, ఎన్నిక కాబడిన దేశాధినేత చేతిలో కాని ఉండడమే గణతంత్రం.

లౌకిక రాజ్యం:-- మత ప్రమేయం లేని రాజ్యం. ప్రభుత్వానికి రాజ్యమతమంటూ ఉండదు.

స్వేచ్ఛ:-భావప్రకటన స్వేచ్చ, మత స్వేచ్చ, ఆలోచనా స్వేచ్ఛ‌

సమానత్వం:- హోదాలోను, అవకాశాల లోను సమానత్వం

న్యాయం: సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం.

గమనిక 1976 లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక అనే పదాలు ప్రవేశికలో చేర్చారు.

భారత రాజ్యాంగానికి 1935 భాతత ప్రభుత్వ చట్టం మూలమయినప్పటికీ అనేక అంశాలను వివిధ దేశాల నుండి స్వీకరించారు.

ఉదా:-1)పార్లమెంటరీ విధానం, ఏక పౌరసత్వం, స్పీకర్ పదవి వంటివి బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించారు

2)సుప్రీంకోర్టు, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షాధికారం - అమెరికా

3)ఆదేశ సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభ సభ్యుల నియామకం - ఐర్లాండ్

4)ప్రాథమిక విధులు - రష్యా

5)అత్యవసర పరిస్థితి - జర్మనీ

6) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ( సమాఖ్య) - కెనడా.


భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు

 భరత రాజ్యాంగంలో ప్రతి విషయాన్ని సవివరంగా తెలపడంతో మన రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉంది.

ధృడ-అధృడ లక్షణాలు కలిగిన రాజ్యాంగం.

ధృడ రాజ్యాంగం:-- సాధారణ చట్టాలను సవరించినట్లుగా రాజ్యాంగాన్ని సవరించడం సాధ్యం కాని లక్షణం

ఉదా:-- అమెరికా రాజ్యాంగం

అధృడ రాజ్యాంగం:- రాజ్యాంగంలోని అంశాలను అతి సులభంగా మార్చే వీలు కలిగి ఉండేది అదృఢ రాజ్యాంగం

ఉదా:-బ్రిటన్ రాజ్యాంగం

ప్రభుత్వం:- రాజ్య లక్ష్యాలను, ఆశయాలను రూపొందించి, అమలు చేసే యంత్రాంగమే ప్రభుత్వం

 ప్రభుత్వ రకాలు

1)పార్లమెంటరీ ప్రభుత్వం:- ఈ విధానంలో వాస్తవ అధికారాలు మంత్రిమండలికి, నామమాత్రపు అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి. అయితే కార్యనిర్వాహక వర్గం పార్లమెంటు కు బాధ్యత వహిస్తుంది.

ఉదా:- భారతదేశం, బ్రిటన్

2)అధ్యక్ష తరహా ప్రభుత్వం:- సర్వాధికారాలు దేశాధినేతకు ఉంటాయి. కార్యనిర్వహక వర్గం శాసనశాఖకు బాధ్యత వహించదు.

ఉదా: - అమెరికా.

3)ఏకకేంద్ర ప్రభుత్వం:- ఏక కేంద్ర ప్రభుత్వాన్ని ఆంగ్లంలో Unitary government అంటారు. Uni అనగా ఏక అని, tary అనగా అధికారం అని అర్థం. అనగా ఒకే అధికార కేంద్రం కలిగిన ప్రభుత్వం.

ఉదా:- బ్రిటన్, ప్రాన్స్

4)సమాఖ్య ప్రభుత్వం:- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు పంపిణీ చేయబడిన ప్రభుత్వం "సమాఖ్య ప్రభుత్వం".

ఉదా:- అమెరికా, భారతదేశం

భారత రాజ్యాంగం- ముఖ్యమైన తేదీలు

1946 జూలై లో రాజ్యాంగ పరిషత్ కు ఎన్నకలు జరిగాయి.

రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాష్ట్రాల, స్వదేశీ సంస్థానాల నుండి ఎన్నికయ్యారు

రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబరు 9న జరిగింది

రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఛైర్మన్ సచ్చిదానంద సిన్హా నియమించబడ్డారు. 

1946 డిశంబరు 11న రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా బాబూ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నియమింపబడ్డారు.

1948 లో సుమారు 8 నెలల పాటు ప్రజల ముందుంచి రాజ్యాంగం పై చర్చించారు

1949 నవంబరు26 నాటికి రాజ్యాంగ రచన పూర్తి చేయబడి పార్లమెంటు చే ఆమోదింపబడింది ‌.🔹 భరత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది.

రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు 315 అధికరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉండేవి. ప్రస్తుతం రాజ్యాంగంలో 448 అధికరణలు, 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు ఉన్నాయి

భారత రాజ్యాంగానికి ఇప్పటికి  సవరణలు జరిగాయి.

మొదటి  రాజ్యాంగ సవరణ1951 లో జరిగింది. 104వ రాజ్యాంగ సవరణ 2019 జనవరి 14న పార్లమెంటు ఆమోదించింది.

భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు

విధి:- ఒక వ్యక్తి ఇతరుల కోసం లేదా సమాజం కోసం నిర్వర్తించ వలసిన బాధ్యతను విధి అంటారు. విధులు దేశాభివృద్ధికి, సమాజ వికాసానికి, సామాజిక స్పృహ కల్పించడానికి దోహదం చేస్తాయి.

విధులు రెండు రకాలు 

1) నైతిక విధులు 

2) పచట్టబద్దమైన విధులు

నైతిక విధులు:- ఇవి ప్రజల నైతిక విలువలు, సామాజిక స్పృహ పై ఆధారపడి ఉంటాయి. 

ఉదా:- పెద్దలను గౌరవించడం, అభాగ్యులను అందుకోవడం

చట్టబద్ధమైన విధులు:- ప్రభుత్వం నిర్దేశించిన బాధ్యతలు. వీటిని ఉల్లంఘించడం శిక్షార్హం

ఉదా:- పన్నులు చెల్లించడం, ట్రాపిక్ నిబంధనలు పాటించడం

ప్రాథమిక విధులు:-ప్రతి పౌరుడు తన దేశం పట్ల కనీస బాధ్యత నిర్వర్తించవలసి ఉంటుంది. అందుకే వీటిని "ప్రాథమిక విధులు" అంటారు. ఇవి కూ డా చట్టబద్దమైన విధులే.

ప్రాథమిక విదులను 1976 లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 విధులను  చేర్చారు. 1977 జనవరి 3 నుండి అమలులోకి వచ్చాయి.

2002 లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని చేర్చారు.

   మొత్తం ప్రాథమిక విధులు

1)రాజ్యాంగ ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి.

2)జాతీయ స్వాతంత్ర పోరాట  స్పూర్తితో ఉన్నత ఆదర్శాలను పాటించాలి.

3)దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను పరిరక్షించాలి.

4)దేశ రక్షణకు, జాతిసేవకు సదా సన్నద్ధంగా ఉండాలి.

5)మత, భాష, ప్రాంతీయ వర్గ వైవిధ్యాలకు అతీతంగా సోదరభావ స్ఫూర్తిని పెంపొందించాలి. స్త్రీలను అగౌరవ పరిచేవాటిని త్యజించాలి.

6)భారత సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవించి పరిరక్షించాలి.

7) ప్రకృతిలోని పరిసరాలను, వన్యప్రాణులను కాపాడాలి. జీవుల పట్ల దయ కలిగి ఉండాలి.

8)శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి.

9)ప్రజల ఆస్తిని పరిరక్షించాలి. హింసను ప్రేరేపించే చర్యల్లో పాల్గొనకూడదు.

10) వ్యక్తిగతంగా, సమిష్టిగా అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చేయాలి.

11)6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు విద్యావకాశాలు కల్పించే బాధ్యతను తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు నిర్వర్తించాలి.

గమనిక:- రాజ్యాంగం మనకు కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించింది. హక్కులు మాత్రమే ఉండి బాధ్యతలు లేకుంటే అరాచకానికి దారితీస్తుందని 1976 లో వీటిని చేర్చారు.


భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు

ఒక దేశం గొప్పదనం, ఆ దేశ పౌరులకు కల్పించిన హక్కులపై ఆధారపడి ఉంటుంది ...లాస్కీ. 

ఈ మాట ప్రాథమిక హక్కుల అవసరానికి, ఔన్నత్యానికి అద్దం పడుతోంది.

పౌరులు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొనుటకు, 

 జీవించుటకు ప్రభుత్వ పరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్ర్యాలే  "ప్రాథమిక హక్కులు". 

ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగానికే తలమానికం.

ప్రాథమిక హక్కులు రాజ్యంగంలో 3వ బాగంలో 12-35 అధిఇరణలో చేర్చారు.

మనకు 7 రకాల హక్కులు ఇవ్వబడినవి. 

ప్రాథమిక హక్కులు మరియు అధికరణలు

1) సమానత్వపు హక్కు (14-18)

2) స్వాతంత్ర్యపు హక్కు(29- 22) 3)పీడనాన్ని నిరోధించే హక్కు (23-24)

 4) మత స్వాతంత్ర్యపు హక్కు( 25-28)

 5) సాంస్కృతిక విద్యా విషయక హక్కు(29-30)

6) ఆస్తి హక్కు ( 31)

7) రాజ్యాంగ పరిహా హక్కు.(32)

గమనిక:- ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటు కు కలదు అయితే వీటి స్ఫూర్తికి భంగం కలగరాదు.

జతీయ అత్యవసర పరిస్థితుల్లో 21వ అధికరణంలోని జీవించే హక్కు మినహా ఏ హక్కునైనా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కలదు.

1978 లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు.

ప్రాథమిక హక్కులకు సంబంధించిన ముఖ్యమైన అధికరణలు 14,17, 21, 29, 30

14వ అధికరణం:- చట్టం ముందు అందరూ సమానమే

17వ అధికరణం:- అస్పృశ్యత నిషేధం

21వ అధికరణం:- జీవించే హక్కు

29వ అధికరణం:- అల్పసంఖ్యాక వర్గాల రక్షణ

30వ అధికరణం:- అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక విద్యాసంస్థల ఏర్పాటు.


ప్రాథమిక హక్కుల లక్షణాలు

ప్రభుత్వం తమ అధికారాలను రాజ్యాంగానికి లోబడి  ప్రజల హక్కులకు భంగం కలగకుండా వినియోగించాలి.

ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది. హక్కులకు భంగం కలిగితే నేరగా సుప్రీంకోర్టునే ఆశ్రయించవచవచ్చు.

హక్కులు పరిమితమైనవి.

ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు.

ముఖ్యగమనిక :- బాధ్యతలు మాత్రమే కలిగి ఉండి హక్కులు లేకపోతే బానిసత్వానికి దారితీస్తుంది.  అందుకే హక్కులు- బాధ్యతలు నాణానికి రెండు వైపులా ఉన్న బొమ్మ- బొరుసు లాంటివి అంటారు.

నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా... భారత రాజ్యాంగము గురించి కొన్ని వాస్తవాలు.

 1) భారత రాజ్యాంగము ఎప్పుడు అమలులోకి వచ్చింది?

జ:-జనవరి 26, 1950.

 2) భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన సమయములో ప్రకరణల సంఖ్య?

జ: 395.

3) భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించినది?

జ: ఐవర్ జెన్నింగ్స్.

4) భారత రాజ్యాంగము యొక్క చిహ్నం?

జ: ఏనుగు.

5) భారత రాజ్యాంగము జనవరి 26 నుంచే అమలులోకి రావడానికి కారణం?

జ:  పూర్ణస్వరాజ్ దినం.

6) భారత రాజ్యాంగము యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఎందులో వివరించబడ్డాయి?

జ: పీఠిక (ప్రియాంబుల్).

7)  భారత రాజ్యాంగమును ఎవరు రచించారు?

జ: భారత రాజ్యాంగ పరిషత్తు.

8) భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క అధ్యక్షుడు?

జ: రాజేంద్రప్రసాద్.

9) భారత రాజ్యాంగము యొక్క ప్రత్యేకత?

జ: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము.

10).భారత రాజ్యాంగము ఏ రోజున రాజ్యాంగ పరిషత్తుచే ఆమోదించబడినది?

జ: నవంబరు 26, 1949.

11) అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగపు ఆత్మగా పేర్కొన్నాడు?

జ:- రాజ్యాంగ పరిహారపు హక్కు.

12) రాజ్యాంగ ప్రవేశికకు ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు?

జ: ఒక్కసారి.

13) భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ వాక్యంతో ప్రారంభమౌతుంది?

జ: భారత ప్రజలమైన మేము......

14) రాజ్యాంగ సభ తొలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?

జ:;సచ్చిదానంద సిన్హా.

15) రాజ్యాంగంలోని తొలి ప్రకరణ దేన్ని తెలుపుతుంది?

జ: భారతదేశము రాష్ట్రాల సమాఖ్య అని.

16) భారత రాజ్యాంగ రచనకు ఎంత ఖర్చు అయింది?

జ: రూ.63,70,729/-.

17)రాజ్యాంగంలో గుర్తించబడిన బాషలు ఏ షెడ్యూల్డ్‌లో చేర్చబడ్డాయి?

జ: 8వ షెడ్యూల్డ్.

18) భారత రాజ్యాంగంలో చిన్నది మరియు విలువైన ప్రకరణ?

జ:-21 (జీవించే హక్కు).

19) రాజ్యాంగం అమలులోకి రాకముందు పార్లమెంటును ఏమని పిల్చేవారు?

జ: ప్రొవిజనల్ పార్లమెంటు.

20) భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యస్థాపన అనే భావన ఏ భాగంలో ఉంది?

జ:-ఆదేశిక సూత్రాలు.


Post a Comment

1 Comments

please do not enter any spam link in the comment box