LATEST POSTS

10/recent/ticker-posts

కరెంట్ అఫైర్స్ 12 & 13 సెప్టెంబర్ 2020

కరెంట్ అఫైర్స్ 12 & 13 సెప్టెంబర్ 2020



కరెంట్ అఫైర్స్  13 సెప్టెంబర్ 2020 PDF : DOWNLOAD 

ఆంధ్రప్రదేశ్‌ 

💨 పొదుపు సంఘాల మహిళలకు ఆర్ధిక తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ ఆసరా పథకం’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 11న ప్రారంభించారు.

💨 2019, ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే మొత్తం రూ.27,168.83 కోట్లు  అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించే వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా  తొలి దశలో రూ.6,792.20 కోట్లను పొదుపు సంఘాల మహిళల ఖాతాలకు జమ చేశారు.

💨 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లు 

💨 సున్నా వడ్డీ కోసం రూ.1400 కోట్లు  పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు  నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. 

👉 ప్రముఖ సంఘ సేవకుడు, ఆధ్యాత్మిక వేత్త స్వామి అగ్నివేశ్(80)సెప్టెంబర్ 11న ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సెన్సైస్ ఆస్పత్రిలో  కన్నుమూశారు.

👉 అగ్నివేశ్ అసలు పేరు వేప శ్యామ్ రావు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఓ కుగ్రామంలో 1939 సెప్టెంబర్ 21న జన్మించిన అగ్నివేశ్ నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో ఛత్తీస్‌గఢ్‌లో తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలో సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు.

👉 సామాజిక కార్యకర్తగా, ఆధ్యాత్మిక వేత్తగా పేరొందిన అగ్నివేశ్ బాలల వెట్టిచాకిరీ నిర్మూలన కోసం బంధ ముక్తి మోర్చా పేరుతో సంస్థను స్థాపించి ఎనలేని కృషి చేశారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు ఆకర్షితులైన అగ్నివేశ్ 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 

👉1977లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికై విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు. వెట్టిచాకిరీని నిరసిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడం, ఆనాటి హరియాణా ప్రభుత్వం దానిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో అగ్నివేశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

👉 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు నాయకులతో చర్చలు జరిపే బాధ్యతని స్వామి అగ్నివేశ్‌కే అప్పగించింది. ఆర్యసమాజ్ ప్రపంచ మండలికి 2014 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

తెలంగాణ

1.హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) సంస్థ కోవిడ్-19 వైరస్‌తోపాటు అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లనూ సమర్థంగా నియంత్రించే ‘లైఫ్ వైరో ట్రీట్’ అనే వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు వెల్లడించింది.

2.సెప్టెంబర్ 11న నైపర్, లైఫ్ ఆక్టివ్‌‌స, సుప్రీం ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అనంతరం నైపర్ డెరైక్టర్ డా.శశిబాలాసింగ్ మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్‌తో ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు అయినా నియంత్రణలోకి వస్తాయని తెలిపారు.

3.ఈ వ్యాక్సిన్‌ వైరల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన క్రిములు కేవలం 3 రోజుల్లో శరీరం నుంచి తొలగిపోతాయని వివరించారు. ఈ మందును ముందు జాగ్రత్త చర్యగా ప్రివెంటివ్ మెడిసిన్‌గానూ వాడవచ్చని పేర్కొన్నారు.

I.భూములపై రైతులు, భూ యజమానుల హక్కులను పరిరక్షించడం, రెవెన్యూ శాఖలో విపరీతంగా పెరిగిన అవినీతి, అక్రమాలను రూపుమాపడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రూపొందించిన తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020కు, వీఆర్వో రద్దు బిల్లుకు తెలంగాణ శాసనసభ సెప్టెంబర్ 11న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

II. తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లుకు, పంచాయతీరాజ్- 2020 సవరణ బిల్లుకు, పురపాలక చట్టం-2020 సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 

III.ప్రస్తుతం అమల్లో ఉన్న భూ యాజమాన్య హక్కులు-1971 చట్టం స్థానంలోనే.. ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ బిల్ -2020ను ప్రభుత్వం తీసుకోచ్చింది.

IV. గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) పోస్టులను రద్దు చేసేందుకు ‘ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్-2020’ను రూపొందించింది.

💛 భూముల సమగ్ర సర్వే భూ రికార్డులను వెబ్‌సైట్ (దరణి పోర్టల్), డిజిటల్(సీడీల రూపంలో), డాక్యుమెంట్ రూపంలో స్టోర్ చేస్తారు. ధరణి వెబ్‌సైట్ ఒకే సర్వర్ మీద ఆధారపడకుండా దేశంలో ఎక్కడ భద్రమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ సర్వర్లు ఏర్పాటు చేస్తారు.

💛 పార్ట్-ఏ(వ్యవసాయ), పార్ట్-బీ(వ్యవసాయేతర) భూములకు వేర్వేరు ధరణి పోర్టళ్లను రెండు విధాలుగా అందుబాటులోకి తేనున్నారు.

💛 ఆర్‌వోఎఫ్‌ఆర్ ఉన్న వాటిని కూడా ధరణి వెబ్ సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరుస్తారు.

💛 సమగ్ర సర్వేలో టెక్నాలజీ ఆధారంగా కోఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) ఉంటాయి.

💛 వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌బుక్‌లను, ఇతర భూములన్నింటికి మెరూన్ కలర్ పాస్‌బుక్‌లను ఇస్తారు.

💛 వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ శాఖ చేస్తే, వ్యవసాయ భూములను రెవెన్యూ శాఖ చేస్తుంది.

💛  రెవెన్యూ కోర్టులన్నీ రద్దయ్యాయి. ఇకపై భూ వివాదాలను సివిల్ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తారు.

💛  వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు ఒక చోటుకు, మ్యుటేషన్‌కు మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాయింట్ రిజిస్ట్రార్ల హోదాలో తహసీల్దార్లే ఆ రెండు పనులు చేసి రైతుకు వెంటనే పాసు పుస్తకం ఇచ్చేస్తారు.

💦 ప్రపంచవ్యాప్తంగా పరిశోధన విద్యార్థులు సమర్పించే పత్రాలను ప్రచురించే జర్నల్‌ పత్రిక రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్టీ (ఆర్‌ఎసఈ) ఇంటర్నేషనల్‌ ఎడిటోరియల్‌ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌ ఎన్నికయ్యారు.

💦 మెటీరియల్‌ అడ్వాన్‌సెస పేరిట ఆర్‌ఎసఈ ప్రచురించే జనరల్‌ ఎడిటోరియల్‌ బోర్డు సభ్యుడిగా ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ సేవలు అందించనున్నట్లు వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం వర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కెమిస్టీ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు.

జాతీయం

😀 సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ – ఈవోడీబీ) కోసం  2020లో 301 సంస్కరణలను అమలు చేయాలని రాష్ట్రాలకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ) సూచించింది. 

😀 2020–21 ర్యాంకుల కోసం 15 విభాగాల్లో ఈ సంస్కరణలను నవంబర్‌లోగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. 

😀 ఈ ఏడాది కొత్తగా పర్యాటకం, టెలికాం, ఆతిథ్యం, ట్రేడ్‌ లైసెన్స్, హెల్త్‌ కేర్, తూనికలు–కొలతలు, సినిమా హాళ్లు, సినిమా షూటింగ్‌లకు సంబంధించిన సంస్కరణలను ప్రవేశపెట్టినట్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ పేర్కొంది.

😀 187 సంస్కరణలను అమలు చేయడం ద్వారా 2019 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈవోడీబీ ర్యాంకుల్లో మొదటి స్థానం పొందినది.


💧 తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తొలగించేందుకు సెప్టెంబర్ 11న భారత్, చైనా మధ్య ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరింది

👉 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) భారత్ ఆర్థిక వ్యవస్థ మైనస్ 11.5 శాతం క్షీణిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది.

👉 భారత్ ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన నివేదికను సెప్టెంబర్ 11న విడుదల చేసింది.ఈ మేరకు క్రితం అంచనా మైనస్ 4 అంచనాలకు మరింత పెంచుతున్నట్లు మూడీస్ తెలిపింది. 

💭నివేదికలోని అంశాలు💭

  • భారత్ క్రెడిట్ ప్రొఫైల్ (రుణ సమీకరణ సామర్థ్యం) వృద్ధి బలహీనత, అధిక రుణ భారం, బలహీన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉంది.
  • వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) భారత్ తక్కువ బేస్ ఎఫెక్ట్ (2020-21లో భారీ క్షీణత కారణంగా) ప్రధాన కారణంగా   10.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉంది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 90 శాతానికి భారత్ రుణ భారం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
  • గత ఆర్థిక సంవత్సరం జీడీపీలో భారత్ రుణ భారం 72 శాతం.
  • ప్రభుత్వ ఆదాయాలు- వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 7.5 శాతానికి చేరే అవకాశం ఉంది.

అంతర్జాతీయ

💭 చైనా అంత‌రిక్ష పరిశోధ‌న సంస్థ  సెప్టెంబర్ 12న ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన రాకెట్ ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. మ‌ధ్యాహ్నం 01:02 గంట‌ల‌కు జిలిన్‌-1 గావోఫెన్ 02సీ ఉప‌గ్ర‌హాన్ని క్వాయ్‌జౌ-1ఏ రాకెట్ ద్వారా అంత‌రిక్షంలోకి పంపించారు. చైనా వాయ‌వ్య ప్రాంతంలోని ఉప‌గ్ర‌హ ప్ర‌యోగ కేంద్రం నుంచి ఈ ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించారు

👉 ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి 40 సెక‌న్ల‌కు ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నరని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబ‌ర్ 10న వ‌ర‌ల్డ్ సూసైడ్ ప్రివెన్ష‌న్ డే సంద‌ర్భంగా వెల్ల‌డించింది. 

👉 సెప్టెంబ‌ర్ 10వ తేదీన వ‌ర‌ల్డ్ సూసైడ్ ప్రివెన్ష‌న్ డే పాటిస్తారు.  

👉 ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్

క్రీడలు

💥2018లో ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన సమయంలో ఓ సెక్యూరిటీ గార్డును కత్తితో పొడిచి చంపాడన్న ఆరోపణలు రుజువు కావడంతో ఇరాన్‌ ఛాంపియన్‌ రెజ్లర్‌ నవీద్‌ అఫ్కారీని  సెప్టెంబర్ 12న  కోర్టు అతనికి ఉరిశిక్షను విధించింది. 

💨 2020 యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను జపాన్‌కు చెందిన నయోమీ ఒసాకా బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకాను వెనక్కి నెట్టి టైటిల్‌ను ఎగరేసుకొని పోయింది. ఫైనల్ మ్యాచ్‌లో 1-6, 6-3, 6-3తో ఒసాకా విక్టోరియా అజరెంకా పై విజయం సాధించింది. 

💨 జపాన్‌కు చెందిన నయోమీ  ఒసాకా తన కెరీర్‌లో రెండోసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకోగా మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను నెగ్గింది. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను కూడా గెలుచుకున్న ఒకాసా ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో సీడ్ గా కొనసాగుతున్నది.

Post a Comment

1 Comments

please do not enter any spam link in the comment box