LATEST POSTS

10/recent/ticker-posts

క‌రెంట్ అఫైర్స్ 07 & 08 సెప్టెంబర్ 2020

క‌రెంట్ అఫైర్స్ 07 & 08 సెప్టెంబర్ 2020


ఆంధ్రప్రదేశ్‌ 



💧 గర్భిణులు, బాలింతలు, పిల్లలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన  'వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్', 'వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ' పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో  సెప్టెంబర్ 7న  ప్రారంభించారు. 

💧 ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్’ పథకం -వివరాలు : రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో పథకాన్ని అమలు చేస్తారు.77 గిరిజన మండాలాల్లోని 8,320 అంగన్‌వాడీల పరిధిలో 3.8 లక్షల మంది పిల్లలు, తల్లులు ఉన్నారు.
ఈ పథకం కోసం రూ.307.55 కోట్లు ఖర్చు చేయనున్నారు.

💧 ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’  పథకం -వివరాలు :రాష్ట్రంలోని మిగిలిన మండలాల్లో అమలు చేస్తారు.ఈ పథకం కోసం దాదాపు రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయనున్నారు.మొత్తంగా ఈ రెండు పథకాల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.1863.11 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో 47,287 అంగన్‌వాడీ కేంద్రాలు గిరిజనేతర ప్రాంతాల్లో ఉన్నారుు. వాటి పరిధిలో 26.36 లక్షల మంది తల్లులు, పిల్లలు ఉన్నారు.

💧 రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షల మందికిఈ పథకాల ద్వారా ప్రయోజం చేకూరనుంది. 

💧 ఈ పథకాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ఆరో నెల నుంచి 36 నెలల వరకు, పిల్లలకు 36 నెలల నుంచి 72 నెలల వరకు పౌష్టికాహారాన్ని అందిస్తారు. 


👉 ‘వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం’:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్నిరైతుల ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి వేసేందుకు ఇక నుంచి ‘వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా పిలుస్తారు.సెప్టెంబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


👉  రైతుల ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం అందించే ఈ పథకం ద్వారా సబ్సిడీ మొత్తాన్ని 2021-22 నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి, అక్కడి నుంచి విద్యుత్ పంపిణీ సంస్థకు బదిలీ చేస్తారు. 

👉  తొలుత శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా 2020, సెప్టెంబర్ నెల నుంచి నగదు బదిలీ విధానాన్ని ప్రారంభించనున్నారు.


తెలంగాణ



💨 తెలంగాణ  రాష్ట్రంలో వీఆర్వోల వ్యవస్థను రద్దుచేసే బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

😀ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్,(వీఆర్‌ఓ) 2020కు ఆమోదం 

💨 భూ లావాదేవీల్లో కోర్‌ బ్యాంకింగ్‌ తరహా వ్యవస్థను అమలుచేసేలా ‘ది తెలంగాణ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ బిల్‌- 2020’ని ఆమోదించింది.

💨 తెలంగాణ రిజిస్ట్రేషన్‌ చట్టం 1908, రూల్‌ 5 ప్రకారం సెప్టెంబరు 8 నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపింది.

💢 క్యాబినెట్‌ ఆమోదించిన ఇతర బిల్లులు  💢


1.పురపాలనలో పారదర్శకత, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ‘తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్‌-2019 సవరణ బిల్లు’ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.

2.భవన నిర్మాణ అనుమతుల్లో వేగం పెంచేందుకుగాను ‘టీఎస్‌ బీపాస్‌' బిల్లుకు ఆమోదం తెలిపింది.

3. వ్యవసాయ భూముల్లో నిర్మించిన ఇండ్ల స్థలాన్ని వ్యవసాయేతర వినియోగ భూమిగా మారుస్తూ అనుమతిని తప్పనిసరి చేసే ‘పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌- గ్రామ పంచాయతీస్‌-ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ యాక్ట్‌-2018’ సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది.
4. తెలంగాణ జీ.ఎస్.టీ యాక్ట్‌ -2017 సవరణ బిల్లుకు ఆమోదం.చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం  సెప్టెంబర్  4న ఉత్తర్వులు జారీ చేసింది. ఆరో సవరణ కింద చట్టంలోని సెక్షన్‌ 3, 4, 5, 10, 11, 12, 13, 15, 16, 17, 31, 46, 48, 117, 164లోని పలు నిబంధనలను మార్చినట్టు ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మార్పులను క్యాబినెట్‌ ఆమోదించింది. 
5.తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్‌ -1956 సవరణ బిల్లు.
6. ది తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020కు ఆమోదం.
7.ది తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్ట్‌ -1972 సవరణ బిల్లుకు ఆమోదం.
8.ప్రైవేట్‌వర్సిటీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్‌ అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020కు ఆమోదం.
9.పంచాయితీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్ట్‌ – 2018 సవరణ బిల్లుకు ఆమోదం
10.‘ది తెలంగాణ డిజాస్టర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌-2020’ 
11. ‘తెలంగాణ ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ బిల్‌-2020’ని ఆమోదించింది.

i.తెలంగాణ సిరి’ పేరుతో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ‘ తయారుచేసిన సేంద్రియ ఎరువును  సెప్టెంబర్ 07న మంత్రి నిరంజన్‌రెడ్డి మార్కెట్‌లోకి విడుదలచేశారు. ఈ ఎరువులు తెలంగాణలోని 600 ఆగ్రోస్‌ కేంద్రాల్లో లభిస్థాయి. 



జాతీయం


👉 రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) దేశీయ సాంకేతికతో తయారు చేసిన హైపర్‌సోనిక్ టెస్ట్ డెమన్‌స్ట్రేటర్ వెహికల్ (హెచ్ఎస్టీడీవీ)ను సెప్టెంబర్ 7న ఉదయం 11.03 గంటలకు ఒడిశా రాష్ట్రం బాలసోర్‌లోని ఏపీజే అబ్దుల్ కలాం టెస్టింగ్ రేంజ్‌లో పరీక్షించారు.

👉 వాతావరణంలో 30 కిలోమీటర్ల ఎత్తులో ధ్వని వేగం కంటే ఆరు రెట్లు వేగంతో పనిచేయనున్న హైపర్ సోనిక్ వెహికల్ స్క్రామ్ జెట్ ఇంజన్‌ డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. రానున్న ఐదేండ్లలో మార్క్ 6 జెట్ ఇంజన్ కన్నా వేగంగా దూసుకెళ్లగల హైపర్‌సోనిక్ క్షిపణులను డీఆర్డీవో తయారు చేయగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

 👉 హైపర్‌సోనిక్ క్షిపణులు సెకండు‌కు రెండు కిలోమీటర్ల దూరం చొప్పున ప్రయాణించి లక్ష్యాలను అత్యంత వేగంగా చేధిస్తాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. 

👉 హైపర్‌సోనిక్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అమెరికా, రష్యా, చైనా తర్వాత నాలుగో దేశంగా గుర్తింపు పొందింది. 

👉 రెండో ప్రపంచ యుద్ధం సమయం నుంచి స్క్రామ్‌జెట్లను అభివృద్ధి చేసేందుకు పలు దేశాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

👉 ఈ హైపర్‌సోనిక్ సాంకేతిక పరిజ్ఞానం 1991లో రష్యా తొలిసారి  కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఆ తరువాతి కాలాల్లో ఫ్రాన్స్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలు ఈ టెక్నాలజీని అందుకున్నాయి. ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన స్క్రామ్‌జెట్‌ ఇంజిన్లు సాధించిన గరిష్ట వేగం ధ్వనికి 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

👉 దేశీయంగా అభివృద్ధి చేసిన హైపర్‌సోనిక్ సాంకేతికత ‘ఆత్మనిర్భర్ భారత్’ను సాకారం చేసుకోవడంలో మైలురాయి వంటిదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్‌సింగ్  ప్రశంసించారు.

  •  రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ( డీఆర్‌డీఓ )   సంస్థ చైర్మన్‌ - సతీష్ రెడ్డి 
 
💧 చ‌ంద్రుడిపైకి చంద్ర‌యాన్-3 మిష‌న్‌ను వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే ప్ర‌యోగించ‌నున్న‌ట్లు భార‌త అంత‌రిక్ష శాఖ‌కు చెందిన స‌హాయ‌మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 

💧 చంద్ర‌యాన్-2తో పోలిస్తే చంద్ర‌యాన్‌-3 భిన్నంగా ఉంటుంద‌న్నారు.  చంద్ర‌యాన్‌-3లో ఆర్బిట‌ర్ ఉండ‌ద‌న్నారు.  కానీ ఆ ప్రాజెక్టులో ల్యాండ‌ర్‌, రోవ‌ర్ ఉన్నాయ‌న్నారు. 2021 మొద‌ట్లోనే చంద్ర‌యాన్‌-3ను ప్ర‌యోగించ‌నున్న‌ట్లు చెప్పారు. 

💧 చంద్ర‌యాన్‌-2ను 2019 జూలై 22న ప్ర‌యోగించారు. సెప్టెంబ‌ర్ 7వ తేదీన విక్ర‌మ్ ల్యాండ‌ర్ చంద్రుడిపై కుప్ప‌కూలింది. కానీ ఆర్బిటార్ మాత్రం డేటాను పంపిస్తూనే ఉన్న‌ది. అయితే మ‌రోవైపు 2008లో ప్ర‌యోగించిన చంద్ర‌యాన్‌-1 పంపిన ఫోటోలు తాజాగా ఓ కొత్త విష‌యాన్ని తేల్చాయి.  చంద్రుడి ద్రువాలు తుప్పుప‌ట్టిపోతున్న‌ట్లు ఆ ఫోటోలు వెల్ల‌డించాయి. నాసా శాస్త్ర‌వేత్త‌లు దీన్ని ద్రువీక‌రించారు.

 💭 ఇందిరా గాంధీ శాంతి బహుమతి 2019 💭 

👉  పలు చిత్రాలు, పుస్తకాల ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి  చేసినందుకు గాను  ఇందిరా గాంధీ శాంతి బహుమతి 2019 బ్రిటన్ కు చెందిన ప్రసిద్ధ వ్యాఖ్యాత డేవిడ్ అటెన్‌బరోకు లభించింది.ఈ శాంతి బహుమతి సెప్టెంబర్ 7న ఆన్‌లైన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అటెన్‌బరోకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించారు.

👉 అర్ధశతాబ్దానికి పైగా డేవిడ్ ప్రకృతి సంపద పరిరక్షణకు అమూల్య మైన సేవలనందించారు. ప్రముఖ నటుడు రిచెర్డ్ అటెన్‌బరోకు సర్ డేవిడ్ అటెన్‌బరో సోదరుడవుతారు. 

  • ఇందిర శాంతి బహుమతి విజేతకు రూ.25లక్షలను అందిస్తారు.


అంతర్జాతీయం


💨 అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉత్తర కరోలినాలోని విల్మింగ్టన్‌ను మొదటి ప్రపంచ యుద్ధం నాటి రెండవ వారసత్వ నగరంగా ప్రకటించారు.

💨  సెప్టెంబర్ 2, 2020 న రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 75 వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు.

💨  రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో విల్మింగ్టన్ నార్త్ కరోలినా షిప్ బిల్డింగ్ కంపెనీ యొక్క ప్రదేశం, ఇది ఫెడరల్ ప్రభుత్వ అత్యవసర నౌకానిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఐదేళ్ళలో 243 నౌకలను నిర్మించింది.

  • అమెరికా రాజధాని : వాషింగ్టన్, D.C.
  • అమెరికా కరెన్సీ    : యునైటెడ్ స్టేట్స్ డాలర్.

💢 జమైకా హైకమిషనర్‌గా డిప్లొమాట్ ఆర్ మసకుయ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రిపబ్లిక్ ఆఫ్‌ జింబాబ్వేకు రాయబారిగా ఉన్నారు.భారత తదుపరి హైకమిషనర్‌గా డిప్లొమాట్ ఆర్ మసకుయ్ నియమితులయ్యారు.

💢 మసకుయ్‌ 1999 నుంచి 2001 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశాడు.

💢  అనంతరం విదేశాంగ సేవలో చేరిన ఆయన ఇండోనేషియాలోని జకార్తాలోని మూడో/ రెండవ కార్యదర్శిగా సేవలందించారు. 

💢 దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ కాన్సుల్‌గా, బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కౌన్సిలర్‌గా పనిచేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌గానూ మసకుయ్‌ పనిచేశారు.

💢 ఆయన త్వరలోనే జమైకా హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సెప్టెంబర్ 06 ప్రకటనలో తెలిపింది. 

 💥 యుఎన్‌ వుమెన్, యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం సంస్థలు తాజాగా విడుదల చేసిన గణాంకాలు ప్రకారం 2021లో దక్షిణాసియాలో మహిళల పేదరికం మరింత పెరగనున్నట్ట స్పష్టం చేస్తున్నాయి. రానున్న దశాబ్దంలో 25 –34 ఏళ్ల వయస్సుల వారిలో పురుషుల కంటే అధికంగా స్త్రీలే పేదరికం బారిన పడతారని ఆ సంస్థ వెల్లడించింది.  

💥 కోవిడ్‌ మహమ్మారి కారణంగా, గత దశాబ్దాలలో మహిళలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి చేసిన కృషి, ఇప్పటి వరకు జరిగిన మహిళల అభివృద్ధి తిరోగమనంవైపు మళ్లుతోందని తెలిపింది. దక్షిణాసియాలో స్త్రీ-పురుష అంతరాలు తీవ్రంగా పెరిగిపోయి, మహిళలు మరింత పేదరికంలోకి కూరుకుపోనున్నారని ‘‘ఫ్రం ఇన్‌సైట్స్‌ టు యాక్షన్‌.. జెండర్‌ ఈక్వాలిటీ ఇన్‌ ది వేక్‌ ఆఫ్‌ కోవిడ్‌–19’’ పేరుతో విడుదల చేసిన రిపోర్టులో పేర్కొన్నాయి. 

 💥 ఫలితంగా 2021 నాటికి 4 కోట్ల 70 లక్షల మంది అదనంగా పేదరికం బారిన పడనున్నారని  గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

 💥 కోవిడ్‌కి ముందు దక్షిణాసియాలో మహిళల పేదరికం రేటు 2021లో 10 శాతంగా అంచనావేయగా, ప్రస్తుతం అది 13 శాతంగా మారనుంది. 2021లో యావత్‌ ప్రపంచంలో, ప్రతి వంద మంది పేద పురుషులకు 118 మంది స్త్రీలు దారిద్య్రంలో ఉంటారని రిపోర్టు తెలిపింది.

 💥  కోవిడ్‌ మహమ్మారి కారణంగా 2021 నాటికి 9.6 కోట్ల మందిని దుర్బర దారిద్య్రంలోకి నెడుతుండగా, అందులో 4.7 కోట్ల మంది స్త్రీలు, బాలికలే ఉంటారని ఈ రిపోర్టులో స్పష్టం అయ్యింది. 

 💥 మన సమాజం, ఆర్థిక వ్యవస్థల నిర్మాణంలో ఉన్న తప్పుడు విధానాల వల్ల ఈ అంతరాలు పెరుగుతున్నట్టు యుఎన్‌ వుమెన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫుంజిలే లాంబో నెకూకా తెలిపారు. 

 💥 మధ్య, దక్షిణ ఆసియా, సహారా ఆఫ్రికా ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా 87 శాతం పేదరికం ఉండగా, ఇప్పుడు అదనంగా మధ్య ఆసియాలో 5.4 కోట్లు, దక్షిణాసియాలో 2.4 కోట్ల మంది ప్రజలు అంతర్జాతీయ దారిద్య్ర రేఖ దిగువకు పడిపోనున్నట్లు ఆ రిపోర్టు వెల్లడించింది.


 💥 కోవిడ్-19  వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దాని పంపిణీ, టీకా డోసులు ఏ దేశానికి ముందు ఇవ్వాలన్న అంశంపై పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఎజెకీల్ జే ఎమ్మన్యూల్ నేతృత్వంలో 19 మందితో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య నిపుణుల బృందం ఒక విధానాన్ని రూపొందించింది. ఈ బృందం పలు దశల్లో వ్యాక్సిన్ పంపిణీకి పలు సూచనలు చేసింది.

 💥 కోవిడ్-19 ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు, ఎవరిపై ఎక్కువగా వైరస్ దాడి చేస్తోంది, మరణాల నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధానాన్ని రూపొందించారు. ప్రపంచంలో అన్ని దేశాలకు ప్రాధాన్యతనిస్తూ టీకా పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సంపన్న దేశాలకు సూచించినది.

 💥 కోవిడ్-19తో ఊహించిన దానికంటే ముందుగా మరణాలు నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి టీకాలు ఇవ్వాలి.

 💥 వైరస్‌తో పోరాడుతూనే ఆర్థికంగా ముందుకు వెళుతున్న దేశాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి. దీని వల్ల కోవిడ్ ప్రభావంతో ఏర్పడిన పేదరికాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలి.

💨 సముద్రంలో అరుదుగా కనిపించే  ప్రపచంలోనే అతిపెద్ద క్షీరదం నీలి తిమింగలం (బ్లూ వేల్‌) దీని పొడవు 25 మీటర్లు, 100 టన్నుల బరువు ఉంటుంది, ఇది ప్రాథమికంగా లక్ష కిలోలు. దీని గుండె ఆఫ్రికన్ ఏనుగు కన్నా పెద్దది. ఈ భారీ క్షీరదం ఇటీవలే ఓ కెమెరాకు చిక్కింది. వందేళ్లలో ఇది కనిపించడం మూడోసారి కావడం విశేషం.  

💨 ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో ఇది కనిపించింది. సీన్ అనే నగరానికి చెందిన ఫోటోగ్రాఫర్ దీన్ని తన కెమెరాలో బంధించాడు. ఈ విషయాన్ని న్యూ సౌత్ వేల్స్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్లానింగ్, ఇండస్ట్రీ అండ్ ఎన్విరాన్‌మెంట్‌ ప్రకటించింది. 

💨 ఈ నీలితిమింగలం వీడియోను ఫొటోగ్రాఫర్‌ ఇన్‌స్టాలో పెట్టాడు. ‘సముద్రపు దిగ్గజం’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ భారీ క్షీరదాన్ని చూసినప్పుడు మొదట ఆశ్చర్యపోయాయని, వెంటనే కెమెరా అందుకుని షూట్‌ చేశానని చెప్పాడు. 



క్రీడలు




 💥 రాజ్యసభ సభ్యుడు అనిల్ జైన్ అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అధ్యక్షుడిగా ఎన్నికైయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 6న జరిగిన ‘ఐటా’ వార్షిక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 

 💥 సెక్రటరీ జనరల్ ‌గా మధ్యప్రదేశ్ టెన్నిస్ సంఘం (ఎంపీటీఏ) అధ్యక్షుడిగా ఉన్న అనిల్ ధూపర్‌ను ,భారత మాజీ డేవిస్ కప్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్‌ను కోశాధికారిగా ఎన్నికయ్యారు. వీరు 2024 వరకు ఆ పదవుల్లో కొనసాగనున్నారు.


💧 ఇంగ్లండ్ కౌంటీ ప్లేయర్ మిచ్ క్లేడన్ స్వింగ్ ను రాబట్టేందుకు తన వద్ద ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ను బంతికి అంటించడంతో నిషేధానికి గురయ్యాడు. సస్సెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతడు 2020, ఆగస్టు నెలలో జరిగిన ఒక మ్యాచ్‌లో బంతికి శానిటైజర్‌ను పూసి బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు దక్కించుకున్నాడు. 

💧 కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్మితో సహా ఎటువంటి పదార్థాలను రాయకూడదనే నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రవేశపెట్టింది. దాంతో ఆస్ట్రేలియాలో జన్మించిన 37 ఏళ్ల క్లేడన్‌పై ఆగ్రహించిన సస్సెక్స్ జట్టు అతడిపై వేటు వేస్తున్నట్లు సెప్టెంబర్ 6న ప్రకటించింది.దీనిపై ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా విచారణ జరిపిస్తోంది. 

క‌రెంట్ అఫైర్స్ బిట్స్


1) ఇటీవల ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రమేది?

A: ఆంధ్రప్రదేశ్

2) ఇటీవల  ఫ్లయ్యింగ్ కార్ ను ఆకాశంలో నడిపిన దేశమేది?

A: జపాన్

3) బెంగుళూరులోని బన్నేర్ ఘాట్ బయలాజికల్ పార్క్ లోని ఏనుగు పిల్లకు ఎవరి పేరు పెట్టారు?

A: సుధామూర్తి

4) భారత్ -రష్యా సంయుక్తంగా నిర్వహించిన నేవి విన్యాసాల పేరేమిటి?

A: ఇంద్ర

5) ఇటీవల రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన బ్రయాన్ బ్రదర్స్ ఏ క్రీడకు చెందినవారు?

A: టెన్నిస్



Post a Comment

3 Comments

please do not enter any spam link in the comment box