కరెంట్ అఫైర్స్ 04 సెప్టెంబర్ 2020
తెలంగాణ
I. కోడిగుడ్ల వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది.
II. ఐసీఎమ్మార్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్), ఎన్‌ఐఎన్ (జాతీయ పోషకాహార సంస్థ) మార్గదర్శకాల ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరూ ఏటా 180 గుడ్లు తినాలి.
III. ఏపీ, తమిళనాడు ఆ తర్వాతి స్థానాల్లో నిలువగా, యూపీ, రాజస్థాన్‌లలో తలసరి వినియోగం చాలా తక్కువగా ఉన్నది.
ఆంధ్రప్రదేశ్
1. పశ్చిమగోదావరి జిల్లాలో మత్స్య రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్-2020కి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సెప్టెంబర్ 3న ఆమోదం తెలిపింది.
2.ఆక్వా రంగంలో నిపుణుల కొరత కారణంగా ఏడాదికి సుమారు రూ.2,500 కోట్లు నష్టపోతున్నామని, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూవర్సిటీ ఏర్పాటు ద్వారా ఆ నష్టాన్ని నివారించవచ్చని అంచనా.
3. ఈ యూనివర్సిటీ వలన సుమారు 90 వేల మంది ఆక్వా రైతులు, దీనిపై ఆధారపడ్డ మరో ఎనిమిది లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆంచనా.
4. యూనివర్సిటీ కోసం రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్ల వ్యయం చేయనున్నారు. ఈ యూవర్సిటీ ద్వారా రాష్ట్రంలో మత్స్య, ఆక్వా రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
i. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ii. ఉత్తరాంధ్రకు 63.2 టీఎంసీల నీటిని తరలించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాల సాగునీటిని అందించి సస్యశ్యామలం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకానికి రూ.15,389.80 కోట్ల వ్యయం అవుతుంది.
1. ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణా డెల్టా చౌడు బారకుండా పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సెప్టెంబర్ 3న ఆమోదం తెలిపింది.
2. ఈ రెండు కొత్త బ్యారేజీలలో ఒకటి ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య కృష్ణా నదిపై 2.70 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం. దీనికి రూ.1,215 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
3. మరొకటి ప్రకాశం బ్యారేజీకి 62 కిలోమీటర్ల దిగువన హంసలదీవికి ఎగువన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికోళ్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూరుపుపాలెం మధ్య కృష్ణా నదిపై 3.25 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మాణం. దీనికి రూ.1,350 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
4. ఈ రెండు బ్యారేజీ నిర్మాణానికి రూ.2,565 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సముద్రపు నీరు ఎగదన్నదు. కృష్ణా డెల్టాను పరిక్షించవచ్చు. తాగునీటికి ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుంది.
I. నాడు-నేడు (మనబడి), నాడు-నేడు (వైద్యం), అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా పథకాల అమలుకు ప్రణాళిక, ఫండింగ్ (నిధుల సమీరణ)తోపాటు సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల అమలుకు అవసరమైన ప్రణాళికను రూపొందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌డీసీ)ను ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 80కి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సెప్టెంబర్ 3న ఆమోదం తెలిపింది.
II. ఈ GO ద్యారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌డీసీ) వంద శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ’గా ఏర్పాటైంది.
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సమాజంలో చెడు ధోరణిలకు కారణమవుతున్న ఆన్‌లైన్ గేమ్స్, (రమ్మీ, పోకర్ ఆన్‌లైన్ జూద క్రీడలు) బెట్టింగులపై నిషేధం విధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్–1974 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
2. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్ గేమ్స్ ఆడేవాళ్లకు 6 నెలలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, రెండోసారి తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష విధించే విధంగా ఏపీ కేబినెట్ నిర్ణయించింది.
జాతీయం
I.“గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్” (జీఐఐ) 2020 విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (వీఐపీఓ) సంకలనం చేసిన టాప్ 100 ఎస్ అండ్ టీ క్లస్టర్ ర్యాంకింగ్స్‌లో 60 వ స్థానాన్ని దక్కించుకోవడానికి బెంగళూరు ఐదు ర్యాంకులు సాధించింది.
II వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల కోసం ప్రపంచవ్యాప్తంగా టాప్ 11 నగరాల్లో చోటు సంపాదించింది.
III..టాప్ 100 ఎస్ అండ్ టీ క్లస్టర్ ర్యాంకింగ్స్‌లో యూరోపియన్ నగరాలైన సావో పాలో, హెలిన్స్కి, వియన్నా, వార్సాలను బెంగళూరు అధిగమించింది.
1.రెండు రోజుల పాటు జరగనున్న భారత్-రష్యా సంయుక్త 11వ విడత 'ఇంద్ర నేవీ' నౌకాదళ విన్యాసాలు బంగాళాఖాతంలో సెప్టెంబర్ 04 ప్రారంభమయ్యాయి.
II.భారత్-రష్యా సంయుక్త 2003లో తొలిసారి నౌకాదళ విన్యాసాలు జరిగాయి. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధానికి గుర్తుగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
III. రెండో ప్రపంచ యుద్ధం విజయం 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలోనూ రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు.
IV.రెండు నౌకాదళాలు ఏండ్ల తరబడి నిర్మించిన అంతఃకార్యాచరణను మరింత బలోపేతం చేయడం, బహుముఖ సముద్ర కార్యాచరణపై అవగహన, విధానాలను మెరుగుపరచడం ఇంద్ర నేవీ-20 ప్రాథమిక లక్ష్యం.
V.కొవిడ్ కారణంగా, "భౌతిక సంబంధం లేకుండా, సముద్రంలో మాత్రమే" ఈసారి విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
1.సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఆస్తులు అత్యధికంగా ఉన్న కంపెనీల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
2.రీసెర్చ్ కంపెనీ మెర్కోమ్ విడుదుల చేసిన టాప్ 10 గ్లోబల్ సంస్థల ర్యాంకులలో అదానీ గ్రూప్‌కు చెందిన గౌతమ్ అదానీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ సృష్టించారు.
3.సోలార్ కంపెనీలు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆస్తులతో పాటు నిర్మాణంలో ఉన్న ఆస్తులు, గెలుచుకున్న ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకొని ర్యాంకుల విడుదల చేసింది.
4.2019 చివరి నాటికి అదానీ 12.32 గిగావాట్ల సోలార్ ప్లాంట్స్‌ను నిర్వహించింది.
5.హాంగ్‌కాంగ్‌కు చెందిన లిస్టెడ్ ఇండిపెండెంట్ సోలార్ పవర్ ప్రొడ్యూసర్ జీసీఎల్ న్యూ ఎనర్జీ 7.1 గిగావాట్లతో రెండో స్థానంలో ఉంది.
6.టోక్యోకు చెందిన ఎస్బీ ఎనర్జీ 7 గిగావాట్లతో మూడో స్థానంలో ఉంది.టాప్ 10 కంపెనీలు కలిసి 33 గిగావాట్ల సోలార్ ప్లాంట్స్‌ను నిర్వహిస్తున్నాయి.
7.అదానీ గ్రీన్ 2015లో తొలి సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది. అయిదేళ్లలోనే ప్రపంచంలోనే టాప్ 1 స్థానానికి ఎదిగింది. ప్రస్తుతం 14.62 గిగావాట్లతో ఉంది. 2025 నాటికి 25 గిగావాట్లను టార్గెట్‌గా పెట్టుకుంది అదానీ గ్రీన్ ఎనర్జీ.
1.‘మిషన్ కర్మయోగి’పధకం : ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, సానుకూల దృక్పథం కలిగినవారుగా, వృత్తి నిపుణులుగా, సాంకేతికంగా మరింత మెరుగైన వారిగా మార్చే అతిపెద్ద పాలనా సంస్కరణగా ‘మిషన్ కర్మయోగి’ పథకాన్నీ కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది.
2. మిషన్ కర్మయోగి లేదా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్(ఎన్‌పీసీఎస్‌సీబీ) కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 2న సమావేశమైన కేబినెట్ పచ్చ జెండా ఊపింది.
3.రూ. 510.86 కోట్ల వ్యయంతో సుమారు 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రమం 2020 నుంచి 2025 వరకు దశలవారీగా కొనసాగుతుంది.
4.ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పథకానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలో కొందరు ఎంపిక చేసిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రఖ్యాత హ్యూమన్ రైట్స్ నిపుణులు సభ్యులుగా ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేస్తారు.
అంతర్జాతీయం
1.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో అమెరికా 2021 జూలై నుంచి తెగదెంపులు చేసుకోనున్నది.
2.డబ్ల్యూహెచ్‌వో ప్రధాన, ప్రాంతీయ కార్యాలయాల్లో ఆరోగ్య, మానవ సేవల నుంచి పూర్తిగా తప్పుకుంటామని ఆ దేశ ప్రతినిధి గురువారం మీడియాకు తెలిపారు.
3.2020 ఆర్థిక ఏడాదికి సంబంధించి డబ్ల్యూహెచ్‌వోకు చెల్లించాల్సిన నిధులపై సమీక్ష జరిపి పాక్షికంగా చెల్లిస్తామని తెలిపారు.
4. కరోనా మహమ్మారితోపాటు గత పదేండ్లలో తలెత్తిన ఇతర ఆరోగ్య సంక్షోభాల నివారణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా విఫలమైందని అమెరికా ఆరోపించింది.
5. ఈ నేపథ్యంలో 2021 జూలై నుంచి డబ్ల్యూహెచ్‌వో కార్యకలాపాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అమెరికా తెలిపింది.
I. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ,రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయగుతో ఫలప్రదవంతమైన చర్చలు జరిగాయని సెప్టెంబర్ 3న వెల్లడించారు.
II. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశాల కోసం రాజ్‌నాథ్ మూడురోజుల రష్యా పర్యటనకు వెళ్లారు.
III. భారత్–రష్యా మధ్య ఏకే–47 203 మోడల్ రైఫిళ్లను భారత్‌లో తయారు చేసే విషయమై భారీ ఒప్పందం ఖరారైంది.
IV. భారత్, రష్యా సంయుక్తంగా ‘ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేయనున్నాయి.
V. ఇందుకు సంబంధించి జాయింట్ వెంచర్(జేవీ)లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(భారత సంస్థ), కల్నోషికోవ్ కన్సెర్న్(రష్యా సంస్థ), రోసోబోరోనెక్స్‌పోర్ట్(రష్యా సంస్థ)లు భాగస్వాములుగా ఉంటాయి.
VI .జాయింట్ వెంచర్(జేవీ)లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి 50.5 శాతం వాటా, కన్సెర్న్‌కు 42 శాతం వాటా, రోసోబోరోనెక్స్‌పోర్ట్‌కు 7.5 శాతం వాటా ఉంది.
విశేషాలు
- ఏకే–47 రైఫిల్‌కు అధునాతన వర్షన్ రైఫిల్ ఏకే–47 203 రైఫిల్. అయితే, ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు.
- ఏకే-47 రైఫిల్స్‌లో 203 రైఫిళ్లు అత్యధునికమైన, అధునాతమైనవి. ప్రస్తుతం భారత సైన్యానికి ఈ తరహా రైఫిళ్లు 7.7 లక్షలు అవరసమున్నాయి. ఇందులో భాగంగా లక్షల రైఫిళ్లను దిగుమతి చేసుకోనున్నది.
- ప్రస్తుతం భారత ఆర్మీ వాడుతున్న ఇన్‌సాస్ 5.56 x45 ఎంఎం అసాల్ట్ రైఫిల్ స్థానంలో ఈ ఏకే- 47 -203 7.62×39 ఎంఎం రైఫిల్స్‌ను ప్రవేశపెడతారు.
- ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇన్సాస్ రైఫిళ్లను 1996 నుంచి వినియోగిస్తున్నారు.
- లక్ష రైఫిల్స్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగతావి భారత్‌లో తయారు చేసేలా ఒప్పందం కుదిరింది.
- ఒక్కోరైఫిల్ ఖరీదు దాదాపు 1100 యూఎస్ డాలర్లు.
- ఇన్సాస్ రైఫిళ్లతో హిమాలయ మంచు ప్రాంతాల్లో జామ్ కావడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే ఆర్మీకి ఏకే- 47 203 మోడల్ రైఫిళ్లను అందించాలని నిర్ణయించారు.
- భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా రష్యా పర్యటన సందర్భంగా రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని ఖరారు చేశాయి అని సెప్టెంబర్ 2న ప్రభుత్వరంగ వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది.
- ఉత్తరప్రదేశ్‌లోని కొర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ ఏకే- 47లను ఉత్పత్తి చేయనున్నారు.
క్రీడలు
I. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం 2028 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనుంది. 2028 సమ్మర్ ఒలింపిక్స్, పారాలింపిక్ గేమ్స్‌కు సంబంధించిన అధికారిక లోగోలను విశ్వ క్రీడల నిర్వాహక కమిటీ ఆవిష్కరించింది.
II. యానిమేటెడ్ మాత్రమే కాదు, నగరం ఆత్మను ప్రతిబింబించేలా ఈసారి వినూత్నంగా ‘ఎల్‌ఏ అక్షరాల కింద 28 నంబర్..దాని కింద ఒలింపిక్స్ చిహ్నాన్ని ఉంచారు.
III. టోక్యో వేదికగా జరగాల్సిన 2020 ఒలింపిక్స్ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.
IV. 2024 ఒలింపిక్స్‌కు పారిస్ నగరం ఆతిథ్యమివ్వనుంది.
1. ప్రపంచ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2020 లో భారత గ్రాండ్ మాస్టర్ (జీఎం) పి.ఇనియన్ చాంపియన్‌గా నిలిచాడు.
2. ఆగస్టు 7 నుంచి 9 మధ్య క్లాసికల్ టైమ్ కంట్రోల్ పద్ధతిలో ఈ టోర్నీ జరిగినా ఫెయిర్ ప్లే నిబంధనలను పరీశిలించిన అనంతరం నిర్వాహకులు సెప్టెంబర్ 3న భారత గ్రాండ్ మాస్టర్ (జీఎం) పి.ఇనియన్ చాంపియన్‌గా ప్రకటించారు.
3. 9 రౌండ్ల పాటు ఆన్‌లైన్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆరు విజయాలు, మూడు ‘డ్రా’లు నమోదు చేసిన 17 ఏళ్ల ఇనియన్. 7.5 పాయింట్లతో రష్యా జీఎం స్జుగిరో సనన్‌తో పాటు సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు.
4. అయితే మెరుగైన ‘టై బ్రేక్’ ఉండటంతో ఇనియన్‌కు టైటిల్ సొంతమైంది. మొత్తం ఈ టోర్నీలో 16 దేశాలకు చెందిన 120 మంది చెస్ ప్లేయర్లు పాల్గొనగా... అందులో 30 మంది జీఎంలు ఉన్నారు.
1) ఈ ఏడాది అటల్ ర్యాంక్ లలో టాప్ ర్యాంక్ పొందిన విద్యా సంస్థ ఏది?
A: ఐఐటి మద్రాసు
2) ఇటీవల మరణించిన మాజీ క్రికెటర చేతన్ చౌహాన్ ఏ రాష్ట్ర మంత్రి వర్గంలో పనిచేసారు?
A: ఉత్తర ప్రదేశ్
3) స్వచ్ఛత ర్యాంకుల్లో పరిశుభ్ర గంగాతీర నగరంగా తొలి స్థానంలో నిలిచిన నగరం ఏది?
A: వారణాసి
4) ఇటీవల రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన వినేశ్ ఫొగాట్ ఏ క్రీడకు చెందిన వారు?
A: రెజ్లింగ్
5) ప్రపంచంలోనే తొలి సారి 200 బిలియన్ డాలర్ల సంపద కలిగిన కలిగిన వ్యక్తిగా అవతరించింది ఎవరు?
A: జెఫ్ బెజోస్
1 Comments
Nice very useful
ReplyDeleteplease do not enter any spam link in the comment box