LATEST POSTS

10/recent/ticker-posts

కరెంట్ అఫైర్స్ 02 సెప్టెంబర్ 2020

 కరెంట్ అఫైర్స్  02 సెప్టెంబర్ 2020 PDF


I.భారత కొత్త ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1న నియమించింది.

II.ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో బాధ్యతలు స్వీకరించారు.

III.ఇటీవల ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా చేరిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ నియమితులయ్యారు.

IV. రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 

V. ఆయన పలు కేంద్ర మంత్రిత్వ శాఖలతోపాటు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. 

VI. రిటైర్‌మెంట్ తర్వాత పబ్లిక్ ఎంటర్‌ప్రై‌జెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఆ పదవిలో ఆగస్టు 31 వరకు కొనసాగారు. 
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ‘ఎకోర్యాప్’ పేరుతో ఒక పరిశోధనా నివేదికను 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అనే అంశంపై సెప్టెంబర్ 1న విడుదల చేసింది.

I. ఆనంద్ బజార్ గ్రూప్ పబ్లికేషన్స్ ఎడిటర్ ఎమిరిటస్, వైస్ చైర్మన్ అవీక్ సర్కార్ ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) చైర్మన్‌గా (75) ఎన్నికయ్యారు.

II. అవీక్ సర్కార్ టెలిగ్రాఫ్, ఆనంద్ బజార్ పత్రిక డైలీలకు ఎడిటర్‌గా వ్యవహరించారు.

III. పంజాబ్ కేసరి గ్రూప్ చీఫ్ ఎడిటర్ విజయ్‌కుమార్ చోప్రా స్థానంలో అవీక్ సర్కార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం ఈ గ్రూప్ కింద ఆరు టీవీ చానళ్లు, అనేక మేగజీన్లు ఉన్నాయి.

IV. పెంగ్విన్ ఇండియాకు ఫౌండింగ్ ఎండీగా, బిజినెస్‌స్టాండర్డ్‌కు ఫౌండింగ్ ఎడిటర్‌గానూ వ్యవహరించారు.

I. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నఅంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) విత్తనం ఎంత కాలం బతుకుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ప్రయత్నం చేస్తుంది.

II. ఆరు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ‘‘స్వాల్‌బోర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్’’లో పదమూడు రకాల విత్తనాలను వందేళ్ల ప్రయోగాల కోసం నిల్వ చేయనుంది.

ముఖ్యాంశాలు

  • 2022-23 లో జరగనున్న ప్రయోగంలో విత్తన బ్యాంకులో విత్తనాలను -18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తారు.
  • ఇక్రిశాట్‌తోపాటు ఇతర సంస్థల్లోని విత్తన జన్యుబ్యాంకులు ఈ ప్రయోగంలో పాల్గొంటున్నాయి.
  • మొత్తం 13 రకాల విత్తనాలను స్వాల్‌బోర్డ్‌లోని విత్తన బ్యాంకులో నిల్వ చేయనుండగా ఇందులో వేరుశనగ, జొన్న, కంది, శనగ మొదలగు నాలుగు పంటలను ఇక్రిశాట్ సమకూర్చనుంది.
  • భవిష్యత్తులో ప్రపంచం మొత్తమ్మీద ఏదైనా పంటను మళ్లీ పునరుద్ధరించేందుకు ఏం చేయాలన్నది ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుంది.
  •  పదేళ్లకు ఒకసారి విత్తనాలను వెలికితీసి పరిశీలించి మళ్లీ నిల్వ చేస్తారు.
I. కమొడోర్ హేమంత్ ఖత్రి హిందుస్థాన్ షిప్‌యార్డ్ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు.

II. నేవీ విశ్రాంత అధికారి అయినా కమొడోర్ హేమంత్ ఖత్రి షిప్‌యార్డ్‌లో 2017 నుంచి డెరైక్టర్ (స్ట్రాటజిక్ ప్రాజెక్ట్)గా పనిచేశారు.

III. రియర్ అడ్మిరల్ ఎల్.వి.శరత్‌బాబు స్థానంలో ఖత్రి నియామకం జరిగింది. డెరైక్టర్‌గా ఉన్న సమయంలో సంస్థలో మరమ్మతుల కోసం వచ్చిన ఐఎన్‌ఎస్ సింధూవీర్, ఐఎన్‌ఎస్ అస్త్రధరణి సబ్‌మెరైన్‌లను నిర్ణీత సమయం కంటే ముందే అందించారు.

IV. ఐఎన్‌ఎస్ దీపక్, ఐఎన్‌ఎస్ శక్తి, నేవల్ ఫీట్ ట్యాంకర్స్ వంటి నౌకలతో పాటు యూరోపియన్ షిప్‌యార్డ్‌లో నౌకల తయారీలో ఖత్రికి అనుభవం ఉంది.
  • హిందుస్థాన్ షిప్‌యార్డ్ ప్రధాన కార్యాలయం - విశాఖపట్నం
I. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ వైపు వెళుతున్న 170 మీటర్ల పొడవైన ఒక సొరంగ మార్గాన్నిజమ్మూలోని సాంబా సెక్టార్‌లో గాలార్ ప్రాంతంలో సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్) కనుగొన్నాయి.

II. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3-4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉంది. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది.

III. పాకిస్తాన్ భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్‌‌స, ఆయుధాలు రవాణా చేయడం కోసమే దీనిని నిర్మించిందని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్ )పేర్కొన్నారు.
  • ప్రస్తుతం సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్ ) డెరైక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా
1. నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా సగటులో భారత్ 72వ ( 437 యూఎస్ డాలర్లు ), స్థానంలో నిలిచింది.

2. అంతర్జాతీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం పికొడి.కామ్ తాజాగా 106 దేశాల్లో జరిపిన సర్వేలో సగటు నెలవారీ జీతాలు, వేతనాలు ఎలా ఉన్నాయన్న దానిపై ఈ విషయం వెల్లడైంది.

3. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ రూ.4.49 లక్షల (5,989 యూఎస్ డాలర్లు) సగటు జీతంతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

4.ఈ జాబితాలో లగ్జెంబర్గ్ ( 4,014 యూఎస్ డాలర్లు ), అమెరికా ( 3,534 యూఎస్ డాలర్లు ) డెన్మార్క్ 3,515, సింగపూర్ 3,414 ,ఆస్ట్రేలియా 3,333, ఖతార్ 3,232, నార్వే 3,174, హాంకాంగ్ 3,024, ఐస్‌లాండ్ 2,644 యూఎస్ డాలర్లు వరుసగా నిలిచాయి.

మరింత కరెంట్ అఫైర్స్ కోసం 👇👇👇

 కరెంట్ అఫైర్స్  02 సెప్టెంబర్ 2020 PDF CLICK HERE

Post a Comment

23 Comments

  1. Nice sir కంటిన్యూ చేయండి

    ReplyDelete
  2. మంచి కంటెంట్ పెడుతున్నారు సర్ , మీ కష్టం కు జోహార్

    ReplyDelete
  3. Please sir continue cheyandi sir..10members ki use iyena chalu
    sir..me kastam vest avvadhu...tq sir

    ReplyDelete
  4. Your really doing great job sir,it is very useful to every aspirant , dont think about who doesn't follow your news think about who followed your news ans blog so dont discontinue please keep continuee...

    ReplyDelete
  5. Worthy information please continue

    ReplyDelete
  6. Meru manchi uddesam to start chesindi madyalo apavaddu,plz continue who knows it is worth for someone

    ReplyDelete
  7. Sir,please dont stop because you given very useful daily current affairs and it's very productive.Daily i followed your group and your pdf info. This helps me a lot to prepare well. Please do continue kindly.

    ReplyDelete
  8. Sir jan to June 6 months current affairs pdf vuntey pettandi sir please

    ReplyDelete
  9. Excellent information for competitive exams please continue sir

    ReplyDelete

please do not enter any spam link in the comment box