LATEST POSTS

10/recent/ticker-posts

కరెంట్ అఫైర్స్ 01 సెప్టెంబర్ 2020

 కరెంట్ అఫైర్స్ 01 సెప్టెంబర్ 2020



కరెంట్ అఫైర్స్ ఆధారంగా స్టాటిక్ జికె  01 సెప్టెంబర్ 2020 CLICK HERE

తెలంగాణ


i. 2020 సెప్టెంబర్‌ను పోషణ మాసంగా ప్రభుత్వం నిర్దేశించిందని ఈ నెలంతా అంగన్‌వాడీల్లో నమోదైన బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.

i. ‘గ్రీన్ స్పేస్ ఇండెక్స్’పేరిట మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆగస్టు 30న వెల్లడించారు.

జాతీయం 


i. ఇంగ్లిష్ భాషను సులభతరంగా నేర్చుకునేందుకు రూపొందించిన ‘ఇంగ్లీష్ ప్రొ’ అనే యాప్‌ను యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (యూఎస్‌ఆర్)లో భాగంగా ఇంగ్లిష్ అండ్ ఫారేన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)  అందుబాటులోకి తెచ్చింది. 

ii. విద్యార్థులు, ఆసక్తి గల అన్ని వర్గాల ప్రజలు ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ తెలిపారు.

iii. ఈ యాప్‌ను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఆగస్ట్ 31న ఢిల్లీలో ప్రారంభించారు.

i.భారత రాజకీయ మార్తాండుడు, 13వ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ముఖర్జీ (84) అనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. 

ii.ఇంట్లో కిందపడి మెదడులో రక్తం గడ్డకట్టిన కారణంగా అనారోగ్యానికి గురై ఆగస్టు 10న దిల్లీ ఆర్మీ రీసెర్చ్‌ రెఫరల్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన మళ్లీ బాహ్యప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూశారు.అనంతరం పరీక్షలు చేసినప్పుడు కరోనా పాజిటివ్‌ అని తేలింది.

iii.. గౌరవసూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులను సంతాపదినాలుగా ప్రకటించింది. ఈనెల 6వ తేదీవరకు దేశవ్యాప్తంగా జాతీయ పతకాన్ని అవనతం చేయనున్నట్లు తెలిపింది. అధికారికంగా ఎటువంటి వినోదకార్యక్రమాలూ ఉండబోవని పేర్కొంది.

iv.51 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో భారత ప్రజాస్వామ్య ఎత్తుపల్లాలను చూసిన అత్యంత అరుదైన నాయకుడు ప్రణబ్‌ముఖర్జీ.

v. 2012లో భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తన అనుభవాలను పంచుకుంటూ రాసిన  ‘ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’ పుస్తకాన్ని వచ్చే డిసెంబర్‌ 11న ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నప్పటికీ ఇంతలోనే ఆయన కన్నుమూశారు.

vi.1969లో కాంగ్రెస్‌నుంచి చీలి ఏర్పడిన బంగ్లా కాంగ్రెస్‌ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన ఆయన బ్యాంకుల జాతీయకరణ సమయంలో పార్లమెంటులో చేసిన  ప్రసంగం ద్వారా ఇందిరాగాంధీ దృష్టిని ఆకర్షించారు.

vii.1971లో జాతీయ కాంగ్రెస్‌లో చేరిన ఆయన మధ్యలో మూడేళ్లు తప్ప మిగిలిన కాలం ఆపార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు.

viii.కోల్‌కతాలోని డిప్యూటీ   అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో గుమస్తాగా ప్రణబ్‌ కెరీర్‌ ప్రారంభించారు.

ix.అధ్యాపకుడిగా, జర్నలిస్టుగా కూడా కొద్దికాలం పనిచేశారు. జాతీయోద్యమంలో తన తండ్రి నిర్వహించిన పాత్రతో స్ఫూర్తి పొందిన ప్రణబ్‌ 1969లో ఇందిర ప్రోత్సాహంతో రాజ్యసభ సభ్యుడిగా పూర్తిస్థాయిలో ప్రజా జీవితంలోకి వచ్చారు.

x. 2004-12 మధ్య పరిపాలన సంస్కరణలు; సమాచార హక్కు; ఉపాధి హక్కు; ఆహార భద్రత; ఇంధన భద్రత; ఐటీ; టెలీకమ్యూనికేషన్స్‌ రంగాల్లోనూ.. విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ, మెట్రోరైళ్ల ఏర్పాటులోనూ ఆయనది కీలకపాత్ర.

xi.1970, 80ల్లో గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్‌ ఏర్పాటులోనూ ఆయనదే ప్రముఖపాత్ర. కేంద్రం, రాష్ట్రాల మధ్య వనరుల పంపకానికి సంబంధించి 1991లో గాడ్గిల్‌-ముఖర్జీ ఫార్ములా రూపొందించిందీ ఆయనే. 

xii. స్వగ్రామం: పశ్చిమబెంగాల్‌లోని బీర్భం జిల్లా మిరాటీ

రాజకీయ సోపానం

* 1966లో బెంగాల్‌ కాంగ్రెస్‌లో చేరిక

* 1969, 75, 81, 93, 99లో రాజ్యసభకు ఎన్నిక.

* 1980-85 మధ్య కాలంలో రాజ్యసభానేతగా వ్యవహరించారు.

* పారిశ్రామిక అభివృద్ధి సహాయ మంత్రి (1973-74)

* నౌకాయానం, రవాణా సహాయ మంత్రి (జనవరి 1974- అక్టోబరు 1974)

* ఆర్థికశాఖ సహాయమంత్రి (అక్టోబరు 1974- డిసెంబరు 1975)

* రెవెన్యూ, బ్యాంకింగ్‌ శాఖ మంత్రి-స్వతంత్రహోదా (1975-1977)

* వాణిజ్యం, ఉక్కు, గనుల శాఖ మంత్రి-కేబినెట్‌ (1980-82)

* ఆర్థికశాఖ మంత్రి (1982-84)

* ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు (1991-96)

* వాణిజ్యశాఖ మంత్రి (1993-95)

* విదేశాంగ మంత్రి (1995-96)

* 2004లో జాంగీపుర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నిక

* జూన్‌ 2004 నుంచి లోక్‌సభ నేతగా బాధ్యతలు

* రక్షణశాఖ మంత్రి (2004-06)

* విదేశాంగ శాఖ (2006-09)

* ఆర్థికశాఖ (జనవరి 2009- జూన్‌ 2012)

* 2012-17: భారత రాష్ట్రపతిగా పనిచేశారు

i. సరళీకరణలకు ముందూ-తర్వాతా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా ప్రత్యేకత పొందారు. 7 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

ii.1984లో ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ ఆర్థిక మంత్రుల్లో ఒకరిగా యూరో మనీ జర్నల్‌ సర్వేలో గుర్తింపు పొందారు. 2010లో ఆసియాలోనే ‘ఫైనాన్స్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా గుర్తింపు లభించింది.

* 1997: ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు.

* 2008: పద్మవిభూషణ్‌

* 2011: భారత ఉత్తమ  పాలనాదక్షుడి అవార్డు

* 2019: దేశ అత్యున్నత  భారతరత్న పురస్కారం.

iii.2017 ఏప్రిల్‌ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నారు. రాష్ట్రపతి హోదాలో ఆయనకు అదే చివరి పర్యటన.

iv. రాష్ట్రపతి హోదాలో శీతాకాలం విడిదికి వచ్చిన ఆయన 2015 జులై 5న యాదాద్రి దివ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన నాలుగో రాష్ట్రపతి ఈయన.

👉 కోల్‌కతాలోని ఆయుధ కర్మాగారాల బోర్డు ఛైర్మన్‌గా, డైరెక్టర్‌ జనరల్‌గా సీఎస్‌ విశ్వకర్మ బాధ్యతలు స్వీకరించారు. 

💢 న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసినందుకు కోర్టు ధిక్కరణ నేరం కింద సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఒక రూపాయి జరిమానా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

💢 క్షమాపణలు కోరడానికి అవకాశమిచ్చినా ఆయన నిరాకరించడంతో ఈ జరిమానాను విధిస్తూ జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

👉 అటార్నీ జనరల్‌ - కె.కె.వేణుగోపాల్

✈️ ముంబయి అంతర్జాతీయ విమనాశ్రయం అదానీ గ్రూపు చేతికి వెళ్లిపోతోంది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు అదానీ గ్రూపు, జీవీకే గ్రూపు వెల్లడించాయి.

✈️ తద్వారా దేశంలోని రెండో అతిపెద్ద విమానాశ్రయాన్ని అదానీ గ్రూపు దక్కించుకున్నట్లు అవుతోంది.

✈️ ఇరుపక్షాలు అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం జీవీకే గ్రూపు సంస్థల నుంచి, ఎంఐఏఎల్‌ (ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌) లో 50.5 శాతం వాటాను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన విమానాశ్రయ ఆస్తుల హోల్డింగ్‌ కంపెనీ- అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఏఏహెచ్‌ఎల్‌) సొంతం చేసుకుంటుంది.

i. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మైనస్ 23.9 శాతం క్షీణించింది.

ii. 40 ఏళ్లలో దేశ జీడీపీ మళ్లీ మైనస్‌లోకి జారిపోవడం ఇదే తొలిసారి. చరిత్రలో ఇంతటి ఘోర క్షీణత నమోదవడం కూడా మొట్టమొదటిసారి.

iii. ప్రస్తుత  త్రైమాసికంలో వ్యవసాయ రంగం మాత్రమే(3.4 శాతం) వృద్ధి రేటును నమోదుచేసుకుంది.

అంతర్జాతీయం

👉ప్రపంచ ఆటబొమ్మల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది.

👉ప్రపంచ ఆటబొమ్మల మార్కెట్ సుమారు రూ. 7 లక్షల కోట్లు కాగా, అందులో భారత్ వాటా చాలా తక్కువ.

i.లెబనాన్ దేశ ప్రధానిగా ముస్తఫా అదీబ్ ఎంపికయ్యారు.

ii.ముస్తఫా అదీబ్ 2013 నుంచి జర్మనీలో లెబనాన్ రాయబారిగా ఉన్నారు.మాజీ ప్రధాని నజీబ్ మికాటికి సలహాదారుగా కూడా పనిచేశారు.

iii.లెబనీస్ రాజకీయ, శాఖల వ్యవస్థలో సున్నీ ముస్లింలు మాత్రమే ప్రధానులు కాగలరు.

iv.ఆగస్టు నాలుగో తేదీన బీరుట్లో జరిగిన పేలుడు నేపథ్యంలో ప్రధాని హసన్ డియాబ్ తన మొత్తం మంత్రివర్గంతో పాటు రాజీనామా చేశారు.

v.ముస్తఫా అదీబ్ 128 ఓట్లకు గాను 90 ఓట్లు సాధించగలగడంతో ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు.

i.గాలిలో వ్యాధికార‌క క్రిముల్ని, ప్ర‌మాద‌క‌రమైన క‌రోనా లాంటి వైర‌స్ ల‌ను గుర్తించి హెచ్చ‌రిక‌లు జారీ చేసే ప‌రిక‌రాన్ని ర‌ష్యా తయారు చేసింది.

ii.మాస్కో సమీపంలో ఆర్మీ క్యాంప్ లో ఆర్మీ 2020 అనే ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశారు.

iii. డిటెక్ట‌ర్ బ‌యోగా పిలిచే ఈ ప‌రిక‌రాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టారు.డిటెక్టర్ బయో గా పిలిచే ఈ డివైజ్ పాకెట్ గాడ్జెట్ కాదు రిఫ్రిజిరేటర్ లా ఉంటుంది.

i.బహుళజాతి సైనిక విన్యాసం కవ్కాజ్-2020 లో భారత సైన్యం పాల్గొనడంలేదు అని తమ బృందాన్ని కవ్కాజ్ కు పంపేది లేదని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.

ii.కవ్కాజ్-2020 ని రష్యాలో నిర్వహిస్తున్నారు. ఈ బహుళజాతి సైనిక విన్యాసంలో రష్యాతోపాటు చైనా, పాకిస్తాన్ దళాలు పాల్గొంటున్నాయి.

iii. దక్షిణ రష్యాలోని ఆస్ట్రాఖాన్ ప్రావిన్స్‌లో ఈ సైనిక విన్యాసం జరుగనున్నది.

iv..ఈ మిలటరీ ఎక్సర్సైజ్లో షాంఘై సహకార సంస్థ, మధ్య ఆసియా దేశాల సభ్య దేశాలు పాల్గొంటాయి.

v. కవ్కాజ్ -2020 కోసం సెప్టెంబరులో దక్షిణ రష్యాకు సుమారు 200 మంది సిబ్బందితో ట్రై-సర్వీసెస్ వ్యాయామంలో పాల్గొనడానికి రష్యా భారతదేశాన్ని ఆహ్వానించింది.

క్రీడలు

i.పురుషుల వెస్ట్రన్‌, సదరన్‌ ఓపెన్‌ టైటిల్‌ను నొవాక్‌ జకోవిచ్‌ దక్కించుకున్నాడు. 

ii. పురుషుల సింగిల్స్‌ తుదిపోరులో జొకో 1-6, 6-3, 6-4తేడాతో మిలోస్‌ రోనిక్‌(కెనడా)పై గెలిచాడు. 

iii. ఈ విజయంతో  35వ మాస్టర్స్‌-1000టోర్నీ టైటిల్‌ సాధించి రఫెల్‌ నాదల్‌ను సమం చేశాడు. 

iv. మహిళల సింగిల్స్ ‌తుదిపోరులో విక్టోరియా అజరెంకా(బెలారస్‌)కు టైటిల్‌ దక్కింది.

v.గాయం కారణంగా నవోమి ఒసాక(జపాన్‌) ఫైనల్‌ నుంచి తప్పుకోవటం వలన  విక్టోరియా అజరెంకా(బెలారస్‌) విజేతగా ప్రకటించారు 

i.బెల్జియన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములా వన్‌ రేసును బ్రిటన్‌ స్టార్‌ రేసర్‌, మెర్సిడెజ్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరోసారి పూర్తి దూకుడు కనబరిచి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు.

ii.కెరీర్‌లో 89వ టైటిల్‌ చేజిక్కించుకొని ఆల్‌టైం గ్రేట్‌ షూ మాకర్‌ అత్యధిక టైటిళ్ల రికార్డుకు హామిల్టన్‌ చేరువైయ్యాడు  

iii.పోల్‌ పొజిషన్‌ నుంచి రేస్‌ ఆరంభించిన లూయిస్‌ మొదటి  నుంచి అదరగొట్టి రెండో స్థానంలో నిలిచిన వాల్తేరీ బొటాస్‌(మెర్సిడెజ్‌) కంటే 8సెకన్లు ముందుగా గమ్యాన్ని చేరుకున్నాడు. 

iv. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్‌.. ఈ ఏడాది సైతం రెండో స్థానంలో ఉన్న వెర్‌స్టాపెన్‌ కంటే 47పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళుతున్నాడు.

Post a Comment

0 Comments